Abn logo
Aug 10 2020 @ 04:47AM

ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

మంచిర్యాల టౌన్‌, ఆగస్టు 9: జిల్లా కేంద్రంలోని సాయికుంటకు చెందిన దుర్గం సంధ్య (26) అనే మహిళ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహ త్య చేసుకుంది.  ఎస్సై రాజమౌళిగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సాయికుంట కు చెందిన సంధ్య శనివారం రాత్రి పురుగుల మందు తాగి పడుకుంది. కొద్ది సేపటికి నోట్లో నుంచి నురుగులు రావడంతో భర్త కృష్ణ గమనించి వెంటనే ప్రభు త్వ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. సంధ్య ఓ నర్సరీలో కూలిగా పని చేస్తుండగా, ఆమె భర్త పెయింటింగ్‌ పనులు చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సంధ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. సంధ్య తల్లి రాజమ్మ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి, ధర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement