ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-22T05:48:07+05:30 IST

ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిం ది.

ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య
బావి వద్ద విచారణ చేపడుతున్న ఏసీపీ, సీఐ

- వరకట్న వేధింపులే కారణమని మృతురాలి తండ్రి ఫిర్యాదు 

- పండగ పూట నిమ్మపల్లిలో విషాదం

పెద్దపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 21: ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిం ది. వరకట్న వేధింపులే కారణమని మృతురాలి తండ్రి ఫిర్యా దు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జూలపల్లి మండలం అబ్బాపూర్‌కు చెందిన విజ య(24)కు పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామానికి చెం దిన ఎతిరాజి స్వామి (29)తో నాలుగేళ్ళ కిత్రం వివాహం జరిగింది. వివా హ సమయం లో ఒప్పుకున్న కట్నకానుకులు అందజేశారు. వా రికి ఇద్దరు పిల్లలు జన్మించారు. కొంతకాలంగా స్వామి తల్లి లచ్చమ్మ, అన్నవదినలు రాములు-రజిత, అక్క దేవక్క(భర్త ను వదిలేసి ఇంటివద్దే ఉంటోంది) విజయతో అదనపు కట్నం తేవాలని హింసిస్తున్నారు. ఈ విషయమై పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగాయి. ఈక్రమం లో మంగళవారం స్వామి సెంట్రింగ్‌ పనికి వెళ్లిన తరువాత అత్త, ఆడబిడ్డ,బావ, తోడికోడలు తనతో గొడవ చేస్తున్నారని భర్తకు విజయ ఫోన్‌ చేసి తెలిపింది. అనంతరం తీవ్ర మన స్తాపానికి గురైన విజయ మూడేళ్ళ కుమారుడు శివకృష్ణ, 14నెలల కూతురు శీకృతిలను తీసుకొని గ్రామ శివారులో ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బుధ వారం ఉదయం ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బావిలో పైకి తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. ఏసీపీ నితికపంత్‌, సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్సై కే రాజే ష్‌లు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విజ య మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టి బావిలో నుంచి బయటకు తీయించారు. విజయ తండ్రి డెక్కం రాజ య్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-22T05:48:07+05:30 IST