గృహిణికి జ్వరం.. కరోనానేమోనన్న భయంతో ఆమె ఎంత ఘోరానికి పాల్పడిందంటే..

ABN , First Publish Date - 2020-08-12T16:30:44+05:30 IST

కరోనా వచ్చిందేమోనన్న భయంతో ఓ గృహిణి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. షాపూర్‌నగర్‌లో నివసిస్తున్న ఎలుగుపల్లి అనంతరెడ్డి, సుజాత (45) భార్యాభర్తలు. స్ధానికంగా సుమిత్రా ట్రేడర్స్‌ కిరాణా షాపు

గృహిణికి జ్వరం.. కరోనానేమోనన్న భయంతో ఆమె ఎంత ఘోరానికి పాల్పడిందంటే..

కరోనా భయంతో గృహిణి ఆత్మహత్య


జీడిమెట్ల, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : కరోనా వచ్చిందేమోనన్న భయంతో ఓ గృహిణి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. షాపూర్‌నగర్‌లో నివసిస్తున్న ఎలుగుపల్లి అనంతరెడ్డి, సుజాత (45) భార్యాభర్తలు. స్ధానికంగా సుమిత్రా ట్రేడర్స్‌ కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం సుజాతకు జ్వరం వచ్చింది. కుటుంబ సభ్యులు ఈమెకు రక్త పరీక్ష చేయించగా మలేరియా అని తేలింది. అప్పటి నుంచి సుజాత తనకు కరోనా వచ్చిందేమోనని తీవ్ర ఆందోళనకు గురైంది. ఈనెల 10వ తేదీ రాత్రి భర్త నైట్‌ డ్యూటీకి వెళ్లగా, కుమారుడు వేరే గదిలో నిద్రిస్తున్నాడు. సుజాత మాత్రం హాల్‌లో పడుకుంది. తెల్లారేసరికి ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. తన తల్లి కరోనా వచ్చిందన్న ఆందోళనతోనే మృతి చెందిందని కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి పోలీసులకు చెప్పాడు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-12T16:30:44+05:30 IST