Abn logo
Sep 18 2021 @ 19:01PM

America లో అద్భుతం.. దాదాపుగా చనిపోయిందని తేల్చిసిన మహిళకు మనవరాలు పుట్టిన మరుక్షణమే..

మేరీల్యాండ్: మెడికల్ మిరాకిల్, వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుతం అనే పదాలు మనం సినిమాల్లో ఎక్కువగా విటుంటాం. చనిపోయిన తర్వాత కొద్దిసేపటికి బతకడం వంటి సన్నివేశాల్లో ఈ పదాలు అధికంగా వినబడతాయి. ఇలా చనిపోయి మళ్లీ బతకడం అనేది నిజ జీవితంలో జరుగుతుందా? అంటే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ, అగ్రరాజ్యం అమెరికాలో ఓ మహిళ విషయంలో ఇదే జరిగింది. అచ్చం సినిమాటిక్ స్టైల్‌లోనే ఓ మహిళ సుమారు 45 నిమిషాల వరకు ఎలాంటి గుండె స్పందన లేక, పల్స్ పడిపోయి దాదాపు చనిపోయిందని వైద్యులు నిర్ధారించిన తర్వాత మళ్లీ బతికింది. దీంతో ఆమెకు చికిత్స అందించిన వైద్యులు ఇది నిజంగా మెడికల్ మిరాకిల్ అనే చెబుతున్నారు. ఇలా 45 నిమిషాల పాటు అచేతనంగా పడిపోయి.. తిరిగి తాను బతికినట్లు తెలుసుకున్న మహిళ ఇది తనకు దేవుడు ఇచ్చిన రెండో లైఫ్‌లైన్ అని చెబుతోంది. అయితే, ఆ మహిళకు ఈ పరిస్థితి గర్భిణీగా ఉన్న ఆమె కూతురి వల్ల వచ్చింది. తల్లి ఎక్కడో దూరంగా ఉన్న సమయంలో కూతురికి పురుటినొప్పులు రావడం.. దాంతో ఆమె హడావుడిగా కూతురును చేర్పించిన ఆస్పత్రికి వచ్చేందుకు ప్రయత్నించడం.. మార్గం మధ్యలో గుండెపోటుకు గురికావడం జరిగింది.  

 

ఇవి కూడా చదవండి..

New York లో మెగా ఫ్యాషన్ ఈవెంట్.. భారత్ నుంచి పాల్గొన్న ఈ Sudha Reddy ఎవరంటే..

ఆ రెండు దేశాల వారికి e-visas లు ఇచ్చేది లేదన్న India..

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మేరిల్యాండ్‌కు చెందిన కాథీ పాటేన్‌కు ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. కాథీకి స్టేసీ ఫిఫర్ అనే కూతరు ఉంది. స్టేసీ నిండు గర్భిణీ. దాంతో కాథీ కూతురును తన వద్దే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటోంది. ఈ క్రమంలో జూలై 22న కాథీ తన కూతురును ఇంటి వద్దే ఉంచి, సరదాగా గోల్ఫ్ ఆడేందుకు బయటకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు కూతురు పురుటినొప్పులు ప్రారంభమైనట్లు తెలిసింది. దాంతో ఆమెను ఓ ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు కాథీకి చెప్పారు. దాంతో కాథీ హడావుడి గోల్ఫ్ కోర్సు నుంచి ఆ ఆస్పత్రికి బయల్దేరింది. అలా ఆస్పత్రికి బయల్దేరిన కాథీ మార్గం మధ్యలో గుండెపోటుకు గురైంది. వెంటనే కాథీని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి వెళ్లేసరికి ఆమెలో ఎలాంటి చలనం లేదు. ఎమర్జెన్సీ రూమ్‌కు తీసుకెళ్లిన వైద్యులు సీపీఆర్ నిర్వహించారు. అయినా ఫలితం లేదు. అప్పటికే గుండె కొట్టుకోవడం ఆగిపోయి, పల్స్ రేటు, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. 

దాంతో వైద్యులు ఆమెను దాదాపు చనిపోయిందని నిర్ధారించారు. అలా 45 నిమిషాల పాటు ఉన్న కాథీలో ఆ తర్వాత నెమ్మదిగా హృదయ స్పందన మొదలైంది. దాంతో ఆమెలో కదిలికను గమనించి వైద్యులు సాధారణ చికిత్స అందించడంతో లేచి కూర్చుంది. ఇది నిజంగా మెడికల్ మిరాకిల్ అని వైద్యులు అన్నారు. చనిపోయిన 45 నిమిషాల తర్వాత మనిషి బతకడం అనేది వైద్య చరిత్రలోనే అరుదుగా జరిగే విషయంగా వైద్యులు పేర్కొన్నారు. ఇక తాను ఇలా చనిపోయి బతకడాన్ని.. కాథీ తనకు దేవుడు ఇచ్చిన రెండో లైఫ్ ఛాన్స్‌గా చెప్పుకొచ్చింది. కాగా, కాథీ అలా లేచి కూర్చొవడానికి కొద్దిసేపటి ముందే స్టేసీ పండంటి పాపకు జన్మనిచ్చింది. అంటే.. మనవరాలు పుట్టిన మరుక్షణమే కాథీ తిరిగి బతికిందన్నమాట. దీంతో తన కుమార్తె స్టేసీ కూతురే తనను మళ్లీ బతికించిందని కాథీ మురిసిపోతోంది.         


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...