Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫ్లోరిడా సూప‌ర్ మార్కెట్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి!

ఫ్లోరిడా: అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌రోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఫ్లోరిడాలోని ఓ సూప‌ర్ మార్కెట్‌లో జ‌రిగిన కాల్పుల్లో ఇద్ద‌రు మృతిచెందారు. సౌత్ ఫ్లోరిడాలోని రాయ‌ల్ పామ్ బీచ్‌లోని ప‌బ్లిక్స్ సూప‌ర్ మార్కెట్‌లో ఓ సాయుధుడు విచ‌క్ష‌ణ ర‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. దీంతో ఇద్ద‌రు అక్క‌డికక్క‌డే చ‌నిపోయారు. మృతుల‌ను ఓ వృద్ధురాలు, ఆమె మ‌న‌వ‌డిగా గుర్తించిన పోలీసులు వారి పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించలేదు. ఇక కాల్పుల అనంత‌రం దుండ‌గుడు కూడా త‌న‌ను తాను కాల్చుకుని చనిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల‌కు పాల్ప‌డిన వ్య‌క్తిని రాయ‌ల్ పామ్ బీచ్‌కు చెందిన టిమోతీ జే వాల్‌(55)గా గుర్తించిన‌ట్లు పామ్ బీచ్ కౌంటీ పోలీస్ అధికారి తెరి బార్బెరా చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement