Viral Video: ఆ మహిళ ధైర్యం చూస్తే వామ్మో అనాల్సిందే.. అంత పెద్ద కొండచిలువను ఎలా తీసుకెళ్తోందో చూస్తే..

ABN , First Publish Date - 2022-08-14T20:20:29+05:30 IST

పాములు, కొండచిలువలు అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. అవి ఉన్నాయని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు.

Viral Video: ఆ మహిళ ధైర్యం చూస్తే వామ్మో అనాల్సిందే.. అంత పెద్ద కొండచిలువను ఎలా తీసుకెళ్తోందో చూస్తే..

పాములు, కొండచిలువలు అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. అవి ఉన్నాయని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. అయితే సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ మహిళ భారీ కొండచిలువను తన భుజాలపై మోస్తూ తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. 


The Reptile Zoo ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. కాలీఫోర్నియాలోని జంతు ప్రదర్శన శాలలో ఉన్న ఓ మహిళ భారీ కొండచిలువను ఎటువంటి భయమూ లేకుండా మోసుకుంటూ తీసుకెళ్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన 15 గంటల్లోనే ఆ వీడియో 54 వేల లైక్‌లను దక్కించుకుంది.  

Updated Date - 2022-08-14T20:20:29+05:30 IST