Abn logo
Sep 10 2021 @ 17:28PM

జవహర్‌నగర్‌లో మహిళ దారుణ హత్య

హైదరాబాద్‌: నగరంలోని జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురయింది. మూడు రోజుల క్రితం రాజమని (48) అనే మహిళ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. శామీర్‌పేట్ పీఎస్‌ పరిధిలోని మలక్‌పేట దగ్గర రాజమని మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాతిపెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీస్తున్నారు. 


క్రైమ్ మరిన్ని...