చేతులెత్తి దండం పెట్టి.. ఏడుస్తూ ఆ 75 ఏళ్ల వృద్ధురాలు చెప్పిన మాటలు విని చలించిపోయిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-13T22:21:33+05:30 IST

ఆ మహిళ వయసు 75 ఏళ్లు.. భర్త చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది.. నలుగురు పిల్లలకు తల్లి అయిన ఆ వృద్ధురాలు ఒంటరిగా కాలం వెల్లదీస్తోంది.

చేతులెత్తి దండం పెట్టి.. ఏడుస్తూ ఆ 75 ఏళ్ల వృద్ధురాలు చెప్పిన మాటలు విని చలించిపోయిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

ఆ మహిళ వయసు 75 ఏళ్లు.. భర్త చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది.. నలుగురు పిల్లలకు తల్లి అయిన ఆ వృద్ధురాలు ఒంటరిగా కాలం గడుపుతోంది.. ముగ్గురు కొడుకులు వేరే ఊళ్లో నివసిస్తుండగా, పెద్ద కొడుకు మాత్రం ఆమె ఇంటికి దగ్గర్లోనే ఉంటున్నాడు.. వృద్ధ తల్లికి ఆ కొడుకు అండగా నిలబడకపోగా రోజూ నరకం చూపిస్తున్నాడు.. ఇంటిని తన పేరు మీద రాయాలని ఆమెను వేధిస్తున్నాడు.. ఆమె మాట వినకపోవడంతో పెద్ద కోడలు దాడికి తెగబడింది.. అత్తను తిడుతూ తీవ్రంగా కొట్టింది (Woman beaten up by daughter in law).. దీంతో ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. 


ఇది కూడా చదవండి..

19 ఏళ్ల కుర్రాడి దారుణం.. మొదట పెట్రోల్ తాగి.. ఆ తర్వాత కాలేజీలో నాలుగో అంతస్తుకు వెళ్లి మరీ..


గ్వాలియర్‌ (Gwalior)లోని ఫల్కా బజార్ హనుమాన్ నగర్‌కు చెందిన 75 ఏళ్ల మహిళకు నలుగురు కుమారులున్నారు. ముగ్గురు కుమారులు గ్వాలియర్ వెలుపల నివసిస్తున్నారు. పెద్ద కొడుకు మాత్రమే గ్వాలియర్‌లో  ఉంటున్నాడు. గ్వాలియర్‌లో ఉన్న ఇంటిలో సగం భాగం ఆమె ఇప్పటికే తన పెద్ద కొడుకు పేరు రాసేసింది. అయితే పూర్తి ఇంటిని తమ పేరు మీద రాయాలని పెద్ద కొడుకు, కోడలు ఆ వృద్ధురాలిని వేధిస్తున్నారు. అందుకు ఆ వృద్ధురాలు అంగీకరించలేదు. ఈ నెల 8వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో పెద్ద కోడలు మమత.. ఆ వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించింది. 


అత్తపై గట్టిగా అరుస్తూ కొట్టింది. ఆమెను నేల మీద పడేసి దాడి చేసింది. ఆ దాడి ఘటనను వృద్ధురాలి మేనల్లుడు మొబైల్ ఫోన్‌లో బంధించాడు. కోడలు చేసిన దాడి గురించి పెద్ద కొడుక్కి చెప్పగా అతను పట్టించుకోలేదు. దీంతో ఆ వృద్ధురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించి కోడలిపై ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పింది విన్న ఎస్పీ చలించిపోయారు. వెంటనే కేసు నమోదు చేసి ఆ వృద్ధురాలి కోడలిని అరెస్ట్ చేయాలని అదేశించారు. 

Updated Date - 2022-08-13T22:21:33+05:30 IST