Crime: మహిళపై అమానుషం.. నడిరోడ్డుపై వివస్త్రను చేసి చితక్కొట్టిన భర్త, అత్తమామలు..

ABN , First Publish Date - 2022-07-11T02:55:16+05:30 IST

ఒక మహిళను ఆమె భర్త, అత్తమామలు దారుణంగా అవమానించారు.. నడిరోడ్డుపై ఆమెను చితక్కొట్టి ఆమె బట్టలు చించేశారు..

Crime: మహిళపై అమానుషం.. నడిరోడ్డుపై వివస్త్రను చేసి చితక్కొట్టిన భర్త, అత్తమామలు..

ఒక మహిళను ఆమె భర్త, అత్తమామలు దారుణంగా అవమానించారు.. నడిరోడ్డుపై ఆమెను చితక్కొట్టి ఆమె బట్టలు చించేశారు.. ఇంతకీ ఆ మహిళ చేసిన నేరమేంటంటే.. తన తల్లిదండ్రులు ఇచ్చిన స్థలాన్ని భర్త పేరు మీదకు బదిలీ చేయడానికి అంగీకరించకపోవడమే.. ఆ విషయమై అత్తింటి వారు ఆమెను చాలా రోజులుగా వేధిస్తున్నారు.. శుక్రవారం రాత్రి గొడవ ముదరడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేసి కొట్టారు.. తన తల్లిని కాపాడుకునేందుకు మూడేళ్ల బాలుడు ప్రయత్నించాడు.. ఆ చిన్నారిని చూసి కూడా వారు జాలి పడలేదు. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Watch: ఆ శునకాన్ని చూసి నేర్చుకోవాలంటున్న నెటిజన్లు.. ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో!


శివపురిలోని హరిపూర్ గ్రామానికి చెందిన సవితా కేవత్ అనే మహిళ తన తల్లిదండ్రుల సహాయంతో ఏడాదిన్నర క్రితం ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసింది. పిల్లలు పెద్దయ్యాక, చదువుకునే సమయంలో ఆ స్థలం ఉపయోగపడుతుందని ఆమె ఆశించింది. ఆ ప్లాట్‌ను కొనేందుకు అవసరమైన డబ్బును సవిత తల్లిదండ్రులు ఇచ్చారు. అయితే ఆ స్థలాన్ని తన పేరు మీదకు మార్చాల్సిందిగా సవతి భర్త తులసీ కేవత్, అతని తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నారు. భర్త పేరు మీదకు మారిస్తే వెంటనే అమ్మేస్తాడనే భయంతో సవతి అందుకు అంగీకరించలేదు. 


భూమిని తన పేరు మీద రిజిష్టర్ చేయలేదనే కోపంతో భర్త తులసి, అతని తల్లి, సోదరుడు.. సవితను తీవ్రంగా కొట్టారు. ఆమె బట్టలు విప్పి నేలపై పడేసి కొట్టారు. సవిత 3 ఏళ్ల కుమారుడు తల్లిని కాపాడేందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నమ్మను కొట్టాడు. తన తల్లిని విడిచిపెట్టాలని ఏడుస్తూ వేడుకున్నాడు. అయినా వారి మనసు కరగలేదు. మహిళ ఫిర్యాదు మేరకు తులసీపై కేసు నమోదు చేసినట్లు కొలారస్ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-07-11T02:55:16+05:30 IST