ఇంటర్నటె డెస్క్: మన దేశంలో భర్తల చేతిలో మోసపోయిన మహిళలు సాధారణంగా బాధపడుతూ కూర్చుంటారు. అదే విదేశాల్లోని మహిళ అయితే.. వేరొకరిని పెళ్లి చేసుకుని తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కానీ ఓ మహిళ మాత్రం.. వినూత్న రీతిలో ఆలోచించి భర్త వస్తువులను క్యాష్ చేసుకుంది. అంతేకాకుండా మిగతా మహిళలు కూడా తన బాటలో నడవాలని సూచించింది. ఇంతకూ ఆమె ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే..
ఫిలిప్పీన్స్‌కు చెందిన జమిల్లే అనే మహిళ కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొత్తలో ఆ జంట సంతోషంగా జీవితం గడిపింది. ఆ తర్వాత అతడు జమిల్లేని మోసం చేశాడు. ఒంటరి చేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కొత్త భావోద్వేగానికి గురైన ఆమె.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వదిలేసి వెళ్లిన పోయిన వారి గురించి బాధపడుతూ కూర్చుంటే లాభం లేదని భావించింది. ఈ నేపథ్యంలోనే తన భర్తకు సంబంధించిన బ్రాండెడ్ దుస్తులు, వస్తువులను పేస్‌బుక్‌లో లైవ్‌లోకి వచ్చి వేలం వేసింది. ఏకంగా రూ.4.38లక్షలు సంపాదించింది. భర్త చేతిలో మోసపోయిన మహిళలు తనలా చేయాలని సూచించింది. భర్త వదిలేసి వెళ్లిన పోయిన వాటిని చూస్తూ బాధపడటమో లేక వాటిని ఊరికే చెత్త బుట్టలో పడేయడమో చేయకుండా తనలా క్యాష్ చేసుకోవాలని వెల్లడించింది. కాగా.. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశం అయింది.
ఇవి కూడా చదవండి