తనకు రావాల్సిన జీతం అడిగినందుకు తండ్రీ కూతుళ్లు తమ దగ్గర పనిచేసే ఓ మహిళను పొట్టనబెట్టుకున్నారు. కర్కశంగా కొట్టడంతో తీవ్ర గాయాల పాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తండ్రీకూతుళ్లను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని రేవారిలో ఈ ఘటన జరిగింది. రేవారికి చెందిన కేశకాళి అనే మహిళ, రాజ్ధర్ దుబే నడుపుతున్న క్యాటరింగ్ సర్వీసెస్లో పని చేస్తోంది. కేశకాళి నెలకు రూ.12 వేలు జీతంగా అందుకుంటోంది.
రాజ్ధర్ ఎప్పుడూ కేశకాళికి సమయానికి జీతం ఇచ్చేవాడు కాదు. ఏప్రిల్ నెల జీతం కూడా ఇవ్వలేదు. దీంతో కేశకాళి నేరుగా యజమాని ఇంటికి వెళ్లి డబ్బు గురించి గొడవ పడింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రాజ్ధర్, అతని కూతురు ప్రియంక.. కేశకాళిపై దాడికి దిగారు. కర్రతో చితక్కొట్టారు. కడుపు మీద తన్నారు. దీంతో కేశకాళి తీవ్ర గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కేశకాళిని హాస్పిటల్కు తరలించారు. అయితే కీలకమైన భాగాలకు దెబ్బలు తగలడంతో కేశకాళి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్ధర్, అతని కూతురు ప్రియంకను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి