పెళ్లి వేడుకలో బంగారం బ్యాగ్ మిస్సింగ్.. కెమెరాల్లో రికార్డైన వీడియోలో ఓ మహిళ నిర్వాకం చూసి అంతా షాక్..!

ABN , First Publish Date - 2021-11-20T20:56:19+05:30 IST

పెళ్లి అంటే మామూలు విషయం కాదు. లెక్కలేనంత పని.. చెప్పలేనంత హడావిడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ పెళ్లి వేడుకలో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. రూ.5లక్షల విలువైన బంగారం, డబ్బులు ఉన్న బ్యాగు అకస్మాత్తుగా కనిపించకుండా పో

పెళ్లి వేడుకలో బంగారం బ్యాగ్ మిస్సింగ్.. కెమెరాల్లో రికార్డైన వీడియోలో ఓ మహిళ నిర్వాకం చూసి అంతా షాక్..!

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి అంటే మామూలు విషయం కాదు. లెక్కలేనంత పని.. చెప్పలేనంత హడావిడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ పెళ్లి వేడుకలో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. రూ.5లక్షల విలువైన బంగారం, డబ్బులు ఉన్న బ్యాగు అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో నూతన వధూవరులు సహా.. పెళ్లికి హాజరైనవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అనంతరం కెమెరాలో రికార్డైన దృశ్యాల్లో ఓ  మహిళ నిర్వాకం చూసి అంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత వారంతా ఏం చేశారనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌కు చెందిన ఓ యువతి, యువకుడికి ఈ నెల 16న పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులూ నిశ్చయించుకున్నారు. అనుకున్న ప్రకారమే అన్ని ఏర్పాట్లు చేశారు. అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. పెళ్లి సందర్భంగా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. మండపం నుంచి రూ.5లక్షల విలువైన బంగారం, డబ్బు ఉన్న బ్యాగు అకస్మాత్తుగా కనిపించకుండాపోయింది. అంతపెద్ద మొత్తంలో డబ్బు, నగలు ఉన్న బ్యాగు పోయిందన్న విషయం.. ఆనోటా ఈనోటా పడి పెళ్లికి హాజరైన అతిథిలందరికీ తెలిసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. 



అనంతరం.. అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి విస్తుపోయారు. అందంగా ముస్తాబైన ఓ మహిళ.. బ్యాగును దొంగిలించినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రాశి గుప్తా అనే మహిళ.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి, జరిగిన విషయాన్ని చెప్పి.. కంప్లైంట్ ఇచ్చింది. ఆ మహిళకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులకు అందించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేసి, పూనమ్ బావ్రీ అనే 24 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆమె నుంచి డబ్బును, నగలను స్వాధీనం చేసుకున్నారు. 




Updated Date - 2021-11-20T20:56:19+05:30 IST