Delhi ఫైవ్ స్టార్ హోటల్‌లో మహిళపై అత్యాచారం

ABN , First Publish Date - 2022-06-10T17:46:15+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో ఓ మహిళపై అత్యాచారం జరిగింది...

Delhi ఫైవ్ స్టార్ హోటల్‌లో మహిళపై అత్యాచారం

డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన నిందితుడు...హైదరాబాద్ వాసి

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో ఓ మహిళపై అత్యాచారం జరిగింది.జూన్ 3న ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తనపై అత్యాచారం జరిగిందని ఢిల్లీలోని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అత్యాచారం చేసిన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు.పోలీసులు కథనం ప్రకారం నిందితుడు, బాధిత మహిళ ఇద్దరూ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు.అత్యాచారం చేసిన నిందితుడు హైదరాబాద్ నివాసి అని, అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం తాము గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు వివరించారు.


Updated Date - 2022-06-10T17:46:15+05:30 IST