Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆమెకు దగ్గరవుదామనుకున్నాడు.. ఆమె తిరస్కరించింది.. దాంతో అతను ఎంతటి నీచానికి తెగించాడంటే..

ఎదురింట్లో ఉన్న మహిళకు దగ్గరవుదామనుకున్నాడు.. ఆమె దగ్గరకు వెళ్లి స్నేహం చెయ్యమని అడిగాడు.. అందుకు ఆమె తిరస్కరించింది.. మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు.. అయినా ఆమె అంగీకరించలేదు.. దీంతో ఆమె మీద పగ పెంచుకున్నాడు.. ఆమె పరువు తీయాలనుకున్నాడు.. ఆమె ఫొటోలను న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి ఆమె ఇంటి బయటి గోడల మీదే అంటించాడు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన జరిగింది. 


మీరట్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఎదురింటి మహిళతో స్నేహం చెయ్యాలనుకున్నాడు. ఆమె వెంట పడి పదే పదే అడిగేవాడు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆమె ఫొటోలను డౌన్‌లోడ్ చేసి వాటిని న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేశాడు. ఆ ఫొటోలను ఆమె ఇంటి బయటి గోడల మీద, అలాగే ఆ ప్రాంతంలోని ఇతర గోడల మీద అంటించాడు. 


ఈ విషయం తెలుసుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన నగ్న ఫొటోలను ఎవరో తమ ప్రాంతంలోని గోడల మీద అంటించారని ఫిర్యాదు చేసింది. తను అనుమానిస్తున్న వ్యక్తి గురించి కూడా పోలీసులకు చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అతను తన ఇంటి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement