Amazing: పిడకలు వేయడంలో ఆ మహిళ ప్రతిభ అదుర్స్.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2022-07-02T01:36:25+05:30 IST

ఇంటర్నెట్‌ వినియోగం పెరిగాక మారుమూల గ్రామాల్లో జరిగే ఆసక్తికర ఘటనలు కూడా అందరినీ చేరుతున్నాయి.

Amazing: పిడకలు వేయడంలో ఆ మహిళ ప్రతిభ అదుర్స్.. వీడియో వైరల్!

ఇంటర్నెట్‌ వినియోగం పెరిగాక మారుమూల గ్రామాల్లో జరిగే ఆసక్తికర ఘటనలు కూడా అందరినీ చేరుతున్నాయి. చాలా మందికి ఉండే అరుదైన నైపుణ్యాలు అందరికీ చేరువవుతున్నాయి. తాజాగా ఓ మహిళ పిడకలు కొడుతున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తరచుగా ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేసే  ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇండియన్ బాస్కెట్ బాల్ టీమ్ ఆమె గురించి వెతుకుతోందని కామెంట్ చేశారు.


ఆ వీడియోలో ఓ మహిళ పేడ ముద్దలతో పొడవైన గోడపై ఒడుపుగా పిడకలు వేస్తోంది. ఆ మహిళ చాలా సులభంగా 15 అడుగుల ఎత్తైన గోడపై పేడ ముద్దలను వరసగా గురిపెట్టి కొడుతోంది. సాధారణంగా ఎత్తైన గోడలపై మహిళలు నిచ్చెన వేసుకుని పిడకలు వేస్తుంటారు. అయితే ఆ మహిళ మాత్రం నిచ్చెన లేకుండా సునాయాసంగా పిడకలు వేసేస్తోంది. ఆమె నైపుణ్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ  వీడియోను ఇప్పటికే 15 లక్షల మంది చూశారు. 48 వేల మందికి పైగా లైక్ చేశారు. 

Updated Date - 2022-07-02T01:36:25+05:30 IST