రూ. 5400 రెమ్‌డెసివిర్‌ను రూ. 20 వేలకు విక్రయిస్తున్న వ్యక్తులకు బేడీలు

ABN , First Publish Date - 2020-07-12T00:28:04+05:30 IST

కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులకు

రూ. 5400 రెమ్‌డెసివిర్‌ను రూ. 20 వేలకు విక్రయిస్తున్న వ్యక్తులకు బేడీలు

ధానే: కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులకు మహారాష్ట్రలోని థానే పోలీసులు అరదండాలు వేశారు. ఔషధాన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు సాయిబాబా నగర్ ప్రాంతానికి చెందిన సోను దర్శి (25), రోడ్రిగ్స్ రౌల్ (31)లను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నాలుగు ఇంజక్షన్ వయల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెమ్‌డెసివిర్ అసలు ధర రూ. 5,400 కాగా, వీరు ఒక్కో వయల్‌ను రూ. 20 వేలకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-12T00:28:04+05:30 IST