మా భార్యలు పుట్టింటికి వెళ్లిపోయారు.. రప్పించండంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అన్నాదమ్ముళ్లు.. వాళ్ల కథేంటో విని..

ABN , First Publish Date - 2022-07-06T01:28:43+05:30 IST

వారిద్దరూ అన్నదమ్ములు. వీరికి ఇద్దరు అక్కాచెల్లెళ్లతో వివాహమైంది. ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే ఇటీవల వీరి కుటుంబంలో విచిత్రమైన సమస్య వచ్చిపడింది..

మా భార్యలు పుట్టింటికి వెళ్లిపోయారు.. రప్పించండంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అన్నాదమ్ముళ్లు.. వాళ్ల కథేంటో విని..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరూ అన్నదమ్ములు. వీరికి ఇద్దరు అక్కాచెల్లెళ్లతో వివాహమైంది. ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే ఇటీవల వీరి కుటుంబంలో విచిత్రమైన సమస్య వచ్చిపడింది. సమస్య పరిష్కారంపై భర్తలు పట్టించుకోకపోవడంతో వారి భార్యలు అలిగి పుట్టింటికి వెళ్లిపోయారు. దీంతో తమ భార్యలను రప్పించాలంటూ అన్నాదమ్ముళ్లు పోలీసులను ఆశ్రయించారు. చివరకు వాళ్ల కథ విని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా మల్పురా పరిధిలో నివాసం ఉంటున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లకు.. నాలుగేళ్ల క్రితం స్థానిక ప్రాంతానికి చెందిన ఇద్దరు అన్నాదమ్ముళ్లతో వివాహమైంది. సోదరులిద్దరూ ఉమ్మడిగా ఉంటూ ఫ్యాక్టరీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇదిలావుండగా, వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఇరుకు ఇంట్లో నివాసం ఉంటున్నారు. మరోవైపు వీరి ఇంట్లో మరుగుదొడ్డి కూడా లేదు. దీంతో వారి భార్యలు.. బహిరంగ ప్రదేశాలకు వెళ్లలేక చాలా ఇబ్బంది పడేవారు. మరుగుదొడ్డి కట్టించమని రోజూ భర్తలను కోరేవారు. అయినా వారు.. రేపు, మాపు అంటూ నెట్టుకొచ్చేవారు. ఈ విషయమై ఇటీవల గొడవలు కూడా జరిగాయి. అయినా అన్నదమ్ములు మాత్రం మరుగుదొడ్డి నిర్మించకుండా కాలయాపన చేశారు. దీంతో విసుగొచ్చిన అక్కాచెల్లెళ్లు.. ఐదు నెలల క్రితం అలిగి పుట్టింటికి వెళ్లారు. మరుగుదొడ్డి నిర్మించేవరకూ తాము వచ్చేది లేదని తేల్చి చెప్పారు.

పూడ్చిపెట్టిన 19 రోజుల తర్వాత సమాధిని తవ్వి మృతదేహానికి DNA Test.. కనీవినీ ఎరుగని వింత కేసు.. అసలు కథేంటంటే..


అన్నదమ్ములు తమ భార్యలను తీసుకొచ్చేందుకు ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తమ భార్యలను రప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం అందరినీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ కౌన్సిలర్ ముందు మహిళలు తమ సమస్యను చెప్పుకొన్నారు. అయితే మరుగుదొడ్డి నిర్మించేంత డబ్బులు తమ వద్ద లేవని అన్నదమ్ములు తెలియజేశారు. దీంతో మరుగుదొడ్డి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తదితరులు ముందుకొచ్చారు. ఎట్టకేలకు సమస్య పరిష్కారమవడంతో అక్కాచెల్లెళ్లిద్దరూ భర్తలతో పాటూ వారింటికి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మహిళల నిర్ణయానికి స్థానికులంతా మద్దతు ఇచ్చారు.

wapping: హై క్లాస్ కుటుంబాల్లో ఇదంతా సాధారణం.. నువ్వే అలవాటు పడాలంటూ ఓ భర్త నీచం.. ఆ భార్య చెబుతున్న నిజాలివి..

Updated Date - 2022-07-06T01:28:43+05:30 IST