‘చేనేత రిజర్వేషన్‌ చట్టం అమలుకు చర్యలు తీసుకోండి’

ABN , First Publish Date - 2020-11-28T06:26:10+05:30 IST

1985లో రూపొందించిన చేనేత రిజర్వేషన్‌ చట్టం అమలు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను చేనేత ప్రతినిధి వర్గం కోరింది.

‘చేనేత రిజర్వేషన్‌ చట్టం అమలుకు చర్యలు తీసుకోండి’

ద్రాక్షారామ, నవంబరు 27: 1985లో రూపొందించిన చేనేత రిజర్వేషన్‌ చట్టం అమలు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను చేనేత ప్రతినిధి వర్గం కోరింది. శుక్రవారం రామచంద్రపురం మండలం హసన్‌బాదలో చేనేత సహకార సంఘాల సమాఖ్య కన్వీనర్‌ దొంతంశెట్టి విరూపాక్షం ఆధ్వ ర్యంలో చేనేత ప్రతినిధుల బృందం ఎంపీ బోస్‌ను కలిసింది. ఈసందర్భంగా దొంతంశెట్టి విరూపాక్షం మాట్లాడుతూ చేనేతను ప్రోత్సహించేందుకు కొన్నిరకాల వస్త్రోత్పత్తులను చేనేతకు కేటాయిస్తూ చట్టం చేశారన్నారు. ఆ మేరకు 11 రకాల వస్త్రోత్పత్తులు చేనేతకు కేటాయించారన్నారు. చేనేతకు రిజర్వు చేసిన వస్త్రాలలో భారతీయ మహిళలు ధరించే చీరలు ప్రధానమైనవని పేర్కొన్నారు. చేనేత రిజర్వేషను చట్టం అమలు బాధ్యత రాష్ట్రాలకు అప్పగించి అవసరమైన నిధులు మం జూరు చేస్తుందన్నారు. కానీ రాష్ట్రాలలో పవర్‌లూమ్స్‌ లాబీకి లొంగి చాలా రాష్ట్రాలు చట్టాన్ని సక్రమంగా అమలు చేయ డం లేదన్నారు. చేనేత రిజర్వేషను చట్టం  అమలు కేంద్రం పర్యవేక్షించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు. చేనేతను జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చేవిధంగా కృషి చేయాలని బోస్‌కు వినతి పత్రం అందజేశారు. 


Updated Date - 2020-11-28T06:26:10+05:30 IST