Abn logo
Jul 8 2021 @ 11:55AM

ఆ డ్రగ్ దొరికితేనే మా అబ్బాయికి మరు జన్మ

ఆసుపత్రి బెడ్ పైన ఏడాది వయసున్న నా గారాలపట్టి అయాన్ష్‌ని చేతుల్లోకి తీసుకుని కూర్చుంటే... కన్నీరు ఉబికి వస్తూనే ఉంది.


ఏమీ చెయ్యలేని నిస్సహాయత, ఆవేదన, అపరాధభావం, అవమానభారం నా కన్నీటిలో కలగలసి ఉన్నాయి.


అత్యంత అరుదైన జన్యు సంబంధ సమస్యకు గురైన నా అయాన్ష్‌కి దూరమవుతానేమోనన్న అలోచన వస్తే చాలు.... బద్దలైన ఆనకట్ట నుంచి భళ్ళున దూసుకొచ్చే ప్రవాహంలాగా... నాలో దుఃఖం పెల్లుబికుతోంది.


మా బాబుకు వచ్చిన ఈ సమస్య నయం కావడానికి అవసరమైన SMA డ్రగ్ ఖరీదు సరిగ్గా రూ.16,00,00,000 (రూ.16 కోట్లు).


మా దగ్గరున్న డబ్బంతా అయిపోయింది. అయాన్ష్‌ని నిద్రపుచ్చి భారమైన, దీర్ఘమైన చూపులతో ఆ పసిప్రాణాన్ని చూశాను. ఏ క్షణమైనా వాడి చివరి క్షణం కావచ్చు.


నా చిన్నారికి వచ్చిన ఈ జబ్బు ఎంత దారుణమైనదంటే... నేను, మావారు ఈ చికిత్సకు కావలసిన డబ్బు సర్దుబాటు చెయ్యకుంటే, వాడు శాశ్వతంగా మాకు దూరమైపోతాడు.


మీ వంతు సహాయం చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి....అయాన్ష్‌కి వచ్చిన ఈ రోగాన్ని Spinal Muscular Atrophy (SMA) అంటారు. దీని వల్ల నరాలు, కండరాల కణజాలానికి తీవ్ర నష్టం జరుగుతుంది. 10 వేల మంది శిశువుల్లో ఒకరికి ఇలాంటి సమస్య వస్తుందట.


ఇది మా హృదయాలను ఛిద్రం చేసే వార్త. అమెరికా నుంచి మాత్రమే దిగుమతి చేసుకోగలిగిన జోల్‌గెన్స్‌మా అనే డ్రగ్‌తో మాత్రమే ఇది నయమవుతుందట.


ఏడాది పసివాడైన అయాన్ష్... తన వయస్సున్న మామూలు పిల్లల మాదిరిగా లేకపోవడం, కదల్లేకపోవడం నేను గమనించినప్పుడు వాడి సమస్య బయటపడింది. ఆ వయసు పిల్లవాడికి అన్నీ చూచి నేర్చుకునే దశ కాబట్టి నేర్చుకోవడంలో సమస్య కావచ్చని మొదట్లో అనుకున్నాను కానీ, కాలం గడుస్తున్న కొద్దీ వాడి పరిస్థితి దిగజారుతూనే ఉంది.


ఆ వయసుకు సహజ క్రియలైన పాలు తాగడం, శ్వాస తీసుకోవడం లాంటివి కూడా మా బాబుకు అసాధ్యంగా మారాయి.


మా పెళ్లయిన 12 సంవత్సరాలకు అయాన్ష్ పుట్టాడు. నరకం లాంటి ఈ సుదీర్ఘ నిరీక్షణ వల్ల జరగకూడనిదేదైనా జరుగుతుందేమోనన్న ఊహను సైతం నేను భరించలేకపోతున్నాను.


కానీ, అదే జరుగుతోంది. రోగాల్లోకెల్లా క్రూరాతి క్రూరమైన రోగానికి మా అబ్బాయిని గురిచేసింది. ఆ చికిత్సకయ్యే ఖర్చు భరించడానికి మాకు ఒక జన్మ సరిపోదు.


నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఇంటి ఇల్లాలిని. నా భర్త టీసీఎస్ కంపెనీ ఉద్యోగి. మాకున్న దాంట్లోనే సర్దుబాటు చేసుకుంటూ జీవితం గడుపుతున్నాం.


కానీ, ఒక ఉద్యోగి ఇంత పెద్ద మొత్తాన్ని (రూ.16 కోట్లు) భరించడం... అందులోనూ ఇప్పటికే సతమతమవుతున్న ఒక కుటుంబానికి... జరగని పని, మోయలేని భారం.


డాక్టర్లు చెప్పారు.... "అయాన్ష్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. వీలైనంత త్వరగా ఆ డ్రగ్ రాకుంటే ఈ వ్యాధి ఆ బాబు పాలిట ప్రాణాంతకం అవుతుంది."  వాళ్ళు అన్న ఈ మాటలు కత్తుల్లా మారి మా దేహంలోని అణువణువునూ చీల్చేశాయి.


అయాన్ష్‌కి ఇంకా జీవితం అంటే ఏంటో కూడా తెలీదు. బ్రతుకులోని అందాన్ని అనుభవించలేదు.


మీ వంతు సహాయం చేసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి....


అందుకే... మీ అందరినీ అర్ధిస్తున్నాను. చికిత్స కోసం అయ్యే ఖర్చు చాలా చాలా పెద్ద మొత్తం అని మాకు తెలుసు. కానీ, నా కొడుకు జీవితం కంటే విలువైనది, భారమైనది మరేది లేదు. దయచేసి మీరంతా మీవల్ల సాధ్యమైనంత మొత్తాన్ని పెద్ద మనస్సుతో మీ వంతు విరాళంగా ఇవ్వండి. అది అయాన్ష్‌కి కొత్త జన్మను ఇస్తుంది.


అయాన్ష్ జీవించడానికి ఒక ఆవకాశం ఇవ్వండి. మీరిచ్చే ప్రతి పైసా ఎంతో విలువైనది.