ఇల్లు చెత్తబుట్టను తలపించకుండా...

ABN , First Publish Date - 2021-01-11T06:03:01+05:30 IST

ఎంత సర్దినా ఇంట్లో ఇంకా చక్కబెట్టవలసింది మిగిలింది అనిపించిందంటే, ఉండకూడని వస్తువులేవో మిగిలిపోయాయని అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని వస్తువుల

ఇల్లు చెత్తబుట్టను తలపించకుండా...

ఎంత సర్దినా ఇంట్లో ఇంకా చక్కబెట్టవలసింది మిగిలింది అనిపించిందంటే, ఉండకూడని వస్తువులేవో మిగిలిపోయాయని అర్థం చేసుకోవాలి. అలాగే కొన్ని వస్తువుల దుమ్ము దులపవలసి ఉందని కూడా గ్రహించాలి. 


కిక్కిరిసిన కిచెన్‌: వంటింట్లో అవసరం లేని జాడీలు, డబ్బాలను పై అలమారాల్లో సర్దడం కంటే, కనిపించే వీలులేకుండా వాటిని అటక ఎక్కించేయడమే మేలు. ఇలా పనికిరాని వస్తువులను పేర్చడం వల్ల వంటిల్లు మరింత ఇరుకుగా కనిపిస్తుంది. 


మాప్‌: ఇల్లు శుభ్రం చేసే చీపుర్లు, మాప్‌లను పొరపాటున కూడా ఇంట్లో కనిపించేలా ఉంచకూడదు. వీటి స్థానం పెరడు, లేదా స్టోర్‌ రూమ్‌. 


డైనింగ్‌ టేబుల్‌: ఉప్పు, పచ్చడి లాంటివి అందుకోవడానికి వీలుగా డైనింగ్‌ టేబుల్‌ మీద ఉంచుకోవడం అవసరమే! అయితే అలాగని వంటింటినంతా డైనింగ్‌ టేబుల్‌ మీద పేర్చేయకూడదు. సాల్ట్‌, పెప్పర్‌, పికిల్‌ల కోసం చిన్నపాటి జార్‌లు డైనింగ్‌ టేబుల్‌ మీద అమర్చుకోవాలి. ఒక హోల్డర్‌లో బటర్‌ నైఫ్‌, రెండు ఫోర్కులు, రెండు స్పూన్లు ఉంచుకుంటే సరిపోతుంది. 


లాండ్రీ బాస్కెట్‌: లాండ్రీ బాస్కెట్‌ స్థానం బెడ్‌రూమ్‌. ఈ బాస్కెట్‌కు తప్పనిసరిగా మూత ఉండేలా చూసుకోవాలి. 


బాల్కనీ: సాఽధారణంగా బాల్కనీని మనందరం మొక్కలతో నింపేస్తూ ఉంటాం. ఇలా కాకుండా పరిమితంగా మొక్కలకు చోటు కల్పించి, రెండు కుర్చీలు వేస్తే, ఆ ప్రదేశాన్ని ఆస్వాదించగలుగుతాం.


మురికిపట్టిన స్విచ్‌లు: డోర్‌ నాబ్స్‌, స్విచ్‌లను ఎక్కువగా తాకుతూ ఉంటాం. కాబట్టి అవి మురికిపడుతూ ఉంటాయి. వాటిని కనీసం వారానికోసారి అయినా సబ్బు నీటితో రుద్ది శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే గడపలూ, తలుపులూ కూడా!


డస్ట్‌బిన్‌: వంటింట్లో, హాల్లో, బాల్కనీలో మూత ఉన్న డస్ట్‌బిన్స్‌ ఉంచాలి.

Updated Date - 2021-01-11T06:03:01+05:30 IST