రైతు లేకుంటే దేశాభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2022-05-25T05:19:14+05:30 IST

రైతు లేకుంటే దేశాభివృద్ధి శూన్యం

రైతు లేకుంటే  దేశాభివృద్ధి శూన్యం
రైతు డిక్లరేషన్‌పై వివరిస్తున్న రామ్మోహన్‌రెడ్డి


  •  డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి 

దోమ, మే24: రైతే దేశానికి వెన్నెముకలాంటివాడని, అన్నంపెట్టే రైతే లేకపోతే దేశాభివృద్ధ్ది శూన్య మని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుండాల్‌, దాదాపూర్‌, మల్లెపల్లి, దోమ గ్రామాల్లో రైతులతో వరంగల్‌ డిక్లరేషన్‌ అంశాలపై రైతులతో చర్చించారు. డిక్లరేషన్‌లోని అంశాలు గడపగడపకు చేరేలా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు లేకుంటే అన్నంపట్టే నాథుడే లేడన్నారు.  అన్నదాతలను చులకనగా చూస్తే ఏ ప్రభుత్వాలు నిలబడవన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రాజు అవుతాడన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పిన అంశాలన్నీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్నారు.రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, గుండాల్‌రాంచంద్రారెడ్డి, మొగులయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:19:14+05:30 IST