ఫోర్జరీలతో విత్‌డ్రాయల్స్‌

ABN , First Publish Date - 2021-03-04T08:54:09+05:30 IST

రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా చిత్తూరు కార్పొరేషన్‌లో నామినేషన్లు వేసిన అభ్యర్థులు లేకుండానే.. వారు సంతకాలు చేయకుండానే అధికారులు వారు విత్‌డ్రా చేసుకున్నట్లు

ఫోర్జరీలతో విత్‌డ్రాయల్స్‌

చిత్తూరు అధికారుల బరితెగింపు


చిత్తూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా చిత్తూరు కార్పొరేషన్‌లో నామినేషన్లు వేసిన అభ్యర్థులు లేకుండానే.. వారు సంతకాలు చేయకుండానే అధికారులు వారు విత్‌డ్రా చేసుకున్నట్లు ప్రకటించారు. పోలీసులు మరింత దారుణంగా వ్యవహరించారు. నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులపై అప్పటికప్పుడు అక్రమ కేసులు నమోదు చేశారు. మద్యం బాటిళ్లు వారి ఇళ్లలో ఉంచి కేసులు పెట్టారు. వీటిని బూచిగా చూపి.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించారు. దెబ్బకు చాలామంది అభ్యర్థులు ఇళ్లకు తాళాలు వేసుకుని, సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. ఆలోపు వారెవరూ రాకున్నా... విత్‌డ్రా చేసేసుకున్నారని అధికారులు ప్రకటించేశారు. ఫలితంగా ఇక్కడ మొత్తం 50కి గాను 37 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. 5, 7, 9, 12, 14, 21, 48, 49, 50వ డివిజన్లలో నామినేషన్‌ వేసిన టీడీపీ అభ్యర్థులు రాజ్‌కుమార్‌, విజయలక్ష్మి, వనజమ్మ, రాజానాయుడు, భార్గవి, లక్ష్మీపతినాయుడు, రతీదేవి, కుప్పన్‌, కంద, కమలాకర్‌, గోపి సహా పలువురు అభ్యర్థులు బుధవారం రాత్రి చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయానికి నేరుగా వచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ దొరబాబుతో కలిసి మీడియా ఎదుట జరిగిన విషయాలను వెల్లడించారు.

Updated Date - 2021-03-04T08:54:09+05:30 IST