వైసీపీకి ఓటేయలేదని పింఛన్ల నిలిపివేత

ABN , First Publish Date - 2021-03-02T07:25:30+05:30 IST

ప్రతినెలా యథావిధిగా వస్తున్న వృద్ధాప్య పింఛన్లను ఎటువంటి కారణం చూపకుండానే మార్చి నెలకు సంబంధించి నిలిపివేశారు. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో ఆందోళన లు చోటుచేసుకున్నాయి.

వైసీపీకి ఓటేయలేదని పింఛన్ల నిలిపివేత
ఒంటారెడ్డిపల్లి గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌తో వాదిస్తున్న టీడీపీ మద్దతు వార్డు మెంబర్లు

నాలుగు గ్రామాల్లో 50 మంది లబ్ధిదారులకు చుక్కెదురు

గ్రామ సచివాలయాల ఎదుట టీడీపీ శ్రేణుల ఆందోళన


కంబదూరు, మార్చి 1: ప్రతినెలా యథావిధిగా వస్తున్న వృద్ధాప్య పింఛన్లను ఎటువంటి కారణం చూపకుండానే మార్చి నెలకు సంబంధించి నిలిపివేశారు. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో ఆందోళన లు చోటుచేసుకున్నాయి. సోమవారం ఆయా గ్రామ సచివాలయాల ఎ దుట టీడీపీ మద్దతు వార్డు మెంబర్లు, లబ్ధిదారులు ఆందోళనకు దిగా రు. వైసీపీకి ఓటువేయలేదనే కారణంతోనే పింఛన్లు నిలిపివేశారని ఆ రోపించారు. ఎటువంటి నోటీసు ఇవ్వలేదంటూ ఆందోళన చేపట్టి అధికారులను నిలదీశారు. మండలంలోని అచ్చంపల్లి, చెన్నంపల్లిలో 35 మందికి, కోటగుడ్డం, ఒంటారెడ్డిపల్లిలో 15 మందికి పైబడి పింఛన్లను నిలిపివేశారు. కంబదూరు పంచాయతీ పరిధిలోని 1, 2, 3 వార్డులకు సంబంధించిన టీడీపీ మద్దతు వార్డు మెంబర్లు ఒంటారెడ్డి గ్రామ సచివాయం ఎదుట ఆందోళన చేపట్టారు. అక్కడే ఉన్న డిజిటల్‌ అసిస్టెం ట్‌ అనిల్‌తో వాదించారు. జెల్లిపల్లి టీడీపీ మద్దతు వార్డు మెంబర్‌ శ్రీధర్‌బాబు అక్కడే ఉన్న వార్డు డిజిటల్‌ అసిస్టెంట్‌, గ్రామ సచివాలయ సిబ్బందితో వాదోపవాదానికి దిగారు.


వైసీపీ ఓటు వేయలేదన్న సాకు తో నిలిపివేయడం దారుణమన్నారు. అదేవిధంగా అచ్చంపల్లి, చెన్నంపల్లి గ్రామ సచివాలయం ఎదుట కూడా ఆందోళన బాటపట్టారు. ఈ నాలుగు గ్రామాల్లోనే కాకుండా మరికొన్ని గ్రామాల్లో కూడా పింఛన్లు నిలిపివేశారని ఎంపీడీఓ శివారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. రెండురోజుల్లోగా నిలిపి వేసిన పింఛన్లను ఇవ్వకపోతే టీడీపీ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన చౌదరి హెచ్చరించారు. 


పింఛనుదారులతో అక్రమ వసూళ్లు 

గుమ్మఘట్ట, మార్చి 1 : మండల కేంద్రంలో వృద్ధులు, వితంతువులకు పంపిణీ చేసే పింఛన సొమ్ములో రూ.60లు వలంటీర్ల ద్వారా వ సూలు చేసినట్లు పింఛనుదారులు వాపోతున్నారు. రెండు నెలలకు సంబంధించి నెలకు రూ.60 చొప్పున ఒకొక్క పింఛనుదారునితో రూ. 120 సొమ్మును వలంటీర్లు జమ చేసుకుని, మిగతా సొమ్ము పింఛనదారులకు అందించినట్లు తెలిపారు. స్థానికంగా దాదాపు 360 మంది పింఛనుదారులు వున్నారు. వారితో ఈ లెక్కన మొత్తం సొమ్మును ఒకేసారి జమ చేసి పంచాయతీ కార్యదర్శికి అప్పజెప్పనున్నట్లు వెల్ఫేర్‌ అ సిస్టెంట్‌ రామాంజినేయులు, వలంటీర్లు పేర్కొన్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి లింగరాజును సంప్రదించగా, తమకు స్వచ్ఛభారత కిం ద స్వచ్ఛసేవకుల జీతాలకు ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి రోజుకు రూ.2లు వసూలు చేయాలనే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో ఒకేసారి పింఛనుదారుల నుంచి ఆ సొమ్మును వసూలు చేసినట్లు తె లిపారు.

   

ఎంపీడీవో శివరామ్‌ ప్రసాద్‌ రెడ్డిని సంప్రదించగా పింఛనదారుల నుంచి సొమ్ము వసూలు చేయడం నేరమని, స్వచ్ఛసేవకుల జీ తాల కోసం వలంటీర్లు కుటుంబ యజమానుల వద్ద నుంచి తమ అం గీకారం మేరకు వసూలు చేయాలని పేర్కొన్నారు. పింఛనదారుల నుంచి వసూలు చేసిన  సొమ్ము తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశించనున్నట్లు తెలిపారు. ‘మన గ్రామం మన పరిశుభ్రత’ కింద పైలెట్‌ ప్రాజెక్టుగా 75 వీరాపురం, గుమ్మఘట్ట గ్రామాలు ఎంపికయ్యాయి. దీంతో పంచాయతీ కార్యదర్శులు పింఛనుదారుల నుంచి సొమ్ము వసూలు చే సే పనికి ఒడిగట్టారు. గ్రామంలో పారిశుధ్య పనులు పడకేసినప్పటికీ ఒకేసారి పింఛనుదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము వ సూలు చేసుకోవడం పట్ల లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-03-02T07:25:30+05:30 IST