60 మంది నామినేషన్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-03-03T04:36:13+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది.

60 మంది నామినేషన్ల ఉపసంహరణ
ఉపసంహరణ ప్రక్రియకు ఏర్పాటు చేసిన వీడియో కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న ప్రత్యేక అధికారిణి రోహిణి

ప్రొద్దుటూరు, మార్చి 2 : మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ మొదటి రోజు ప్రశాంతంగా జరిగింది. మొత్తం 60 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల స్వీకరణ ఘట్టం గతేడాది జరిగింది. మొత్తం 41వార్డులకు సంబంధించి 288 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో నామినేషన్ల పరిశీలనలో 12 వాటిని తిరష్కరించగా 276 మంది బరిలో ఉండగా, మంగళవారం 60 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందు లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒకరు, టీడీపీ 17, వైసీపీ 33, స్వతంత్ర అభ్యర్థులు 9 మంది ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను ఎన్నికల ప్రత్యేక అధికారి పి.రోహిణి పరిశీలించారు. 

ఎర్రగుంట్లలో 8 మంది ...

ఎర్రగుంట్ల, మార్చి 2: ఎర్రగుంట్ల నగరపంచాయతిలో  మొత్తం 106 నామినేషన్లు ఉండగా ఇందులో గతేడాది 47 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా వాటిని  మంగళవారం 8మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందు లో  బీజేపీ ఒకరు, వైసీపీ 5, ఇండిపెండెంట్లు ఇద్దరు నామినేష న్లు ఉపసంహరించుకోగా దీంతో మంగళవారం నాటికి 51మం ది బరిలోఉన్నారు. బుధవారం ఉదయం 11గంటల నుంచి 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉండ టంతో మరింతమంది ఉపసంహరించుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

ఉపసంహరణకు పటిష్ట బందోబస్తు

జమ్మలమడుగు రూరల్‌, మార్చి 2:  నగర పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం తొలిరోజు నామినేషన్ల ఉపసంహరణకు సంబందించి జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు ఆదేశాల మేరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో తొలిరోజు 15 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నాని కమిషనర్‌ వెంకటరామిరెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-03-03T04:36:13+05:30 IST