నకిరేకల్‌లో 18 నామినేషన్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-04-21T07:09:38+05:30 IST

నకిరేకల్‌ మునిసిపాలిటీ ఎన్నికల్లో మంగళవారం 18 మంది అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు.

నకిరేకల్‌లో 18 నామినేషన్ల ఉపసంహరణ

నకిరేకల్‌, ఏప్రిల్‌ 20: నకిరేకల్‌ మునిసిపాలిటీ ఎన్నికల్లో మంగళవారం 18 మంది అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. మొత్తం 20 వార్డులకు 195 మంది అభ్యర్థులు 305 నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, మంగళవారం 18 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 1వ వార్డులో ఏడుగురు, 2లో నలుగురు, మూడులో ఇద్దరు, ఏడో వార్డులో ఇద్దరు, 13వ వార్డులో ఇద్దరు, 19వ వార్డులో ఒకరు చొప్పున అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు మునిసిపల్‌ కమిషనర్‌ బాలాజీ తెలిపారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-04-21T07:09:38+05:30 IST