Jul 8 2021 @ 01:24AM

త్రివిక్రమ్‌ క్లాప్‌తో...

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం9గా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న నూతన చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు శౌరి చంద్రశేఖర్‌ టి. రమేశ్‌కు హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ అధినేత ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) స్ర్కిప్ట్‌ అందజేశారు. ‘‘ఆగస్టులో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ప్రేమలోని సున్నిత పార్శ్యాలను సృశిస్తూ సాగుతుంది’’ అని దర్శకుడు చెప్పారు. తమిళ నటుడు అర్జున్‌ దాస్‌ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి మాటలు: గణేశ్‌కుమార్‌ రావూరి, కెమెరా: వంశీ పచ్చిపులుసు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: వివేక్‌ అన్నామలై, సంగీతం: స్వీకార్‌ అగస్తి, సమర్పణ: పీడీవీ ప్రసాద్‌.