Oct 19 2021 @ 00:55AM

మూడు వేరియేషన్స్‌తో...

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా కల్యాణ్‌ జి. గోగణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తీస్‌మార్‌ ఖాన్‌’. పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయిక. సునీల్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. దసరా సందర్భంగా సినిమా టైటిల్‌, ఆది సాయికుమార్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోంది. ఈ యాక్షన్‌ ఓరియంటెడ్‌ చిత్రంలో స్టూడెంట్‌, రౌడీ, పోలీస్‌గా మూడు వేరియేషన్స్‌ ఉన్న పాత్రను ఆది సాయికుమార్‌ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: నాగం తిరుపతి రెడ్డి, సంగీతం: సాయికార్తిక్‌. ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి.