Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ ఒక్క ‘వార్త’తో..

ముంబై : స్మాల్‌ క్యాప్ మెటల్స్, మైనింగ్ సంస్థ... ‘రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్‌సర్స్’... కే ఒక్క ప్రకటనతో ఈ కంపెనీ షేర్లకు మంచి ఊపొచ్చింది. గడిచిన కొన్ని సెషన్లలో రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్‌సర్స్ షేర్లు పెరుగుతూ వస్తున్నాయి. స్టాక్ అప్పర్ సర్క్యూట్‌ను తాకి, కొత్త గరిష్టానికి ఎగసింది. ఇండియన్ ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా సంస్థలో రూ. 31 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నారంటూ రాఘవ్ ప్రొడక్టివిటీ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించిన విషయం తెలిైసిందే. ఇందుకు సంబంధించిన ప్రకటన నేపధ్యంలో... అప్పటినుంచి కంపెనీ షేర్లు ఎగసిపడుతున్నాయి.  రాఘవ్ ప్రొడక్టివిటీ షేర్లు కేవలం ఒక నెలలోనే కంపెనీ 90 శాతానికి పైగా పెరిగాయి. బీఎస్ఈలో ఒక్కో షేరుకు అత్యధికంగా రూ. 871 చొప్పున ట్రేడవుతున్నాయి. 

Advertisement
Advertisement