టెక్నాలజీతోనే అందరికీ వైద్యం సాధ్యం

ABN , First Publish Date - 2020-02-20T06:31:07+05:30 IST

కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలంటే.. టెక్నాలజీ ఒక్కటే మార్గం. కరోనా వైరస్‌ వంటి అత్యవసర పరిస్థితులు అధిగమించాలన్నా.. వాటిని

టెక్నాలజీతోనే అందరికీ వైద్యం సాధ్యం

 ఏఐతో కచ్చితమైన చికిత్స

ఇంటెల్‌ ఇండియా చీఫ్‌ నివృతి రాయ్‌

 హైదరాబాద్‌లో ఇంటెల్‌ ఏఐ కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలంటే.. టెక్నాలజీ ఒక్కటే మార్గం. కరోనా వైరస్‌ వంటి  అత్యవసర పరిస్థితులు అధిగమించాలన్నా.. వాటిని ముం దుగా అంచనా వేయాలన్నా టెక్నాలజీ వల్లే సాధ్యమవుతుందని ఇంటెల్‌ ఇండియా అధిపతి నివృతి రాయ్‌ అన్నారు. ప్రస్తుతం కంప్యూటింగ్‌ సామర్థ్యాలు పెరిగా యి. కంప్యూటింగ్‌, డేటా నిల్వల సామర్థ్యాలు తక్కువ వ్యయానికే లభిస్తున్నాయి. అందువల్ల డేటాను విశ్లేషణ చేయడం చౌక అయిందని వ్యాఖ్యానించారు. బయోఏషియాలో ఆమె ఏఐ ఫర్‌ సోషల్‌ గుడ్‌-అడ్వాన్సింగ్‌ అఫర్డబుల్‌ హెల్త్‌కేర్‌’ అనే అంశంపై మాట్లాడారు. మూత్ర పిండాల వ్యాధిని డాక్టర్ల కంటే ముందే ఎంతో కచ్చితంగా కృత్రిమ మేధ (ఏఐ) గుర్తించగలదు. కంప్యూటింగ్‌ ద్వారా 200 రెట్లు వేగంగా డయాగ్నోసిస్‌ చేయొచ్చని అందుకు అవసరమైన కంప్యూటింగ్‌ సామర్థ్యాలున్నాయన్నారు.


6,000 మందికి ఒక స్పెషలిస్ట్‌

దేశంలో ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక డాక్టరు మాత్రమే ఉన్నారు. ప్రతి ఆరు వేల మందికి ఒక స్పెషలిస్టు మాత్రమే సేవలు అందిస్తున్నాడు. దేశంలో డయేరియా వంటి వ్యాధుల చాలామంది చనిపోతున్నారు. టెక్నాలజీ మాత్రమే ఇటువంటి మరణాలను అడ్డుకోగలదు. లెక్కలు, ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ను వినియోగించి ఉపద్రవాలను నివారించవచ్చు. ప్రత్యేకమైన వ్యాధులను కలిగించే 201-220 వైర్‌సలు ఉన్నట్లు గుర్తించారు. ప్రతి ఏడాది 2.3 వైర్‌సలను గుర్తిస్తున్నారు. 18 శాతం కేన్సర్‌ మరణాలకు వైరస్సే కారణం. కేన్సర్‌ చికిత్సకు ప్రతి ఏడాది 80 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. తప్పుడు చికిత్సల వల్ల 2.5 బిలియన్‌ డాలర్లను అనవసరంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇటువంటి ఖర్చులను టెక్నాలజీతో నివారించవచ్చని రాయ్‌ అన్నారు. కాగా, ఇంటెల్‌ ఏఐ అప్లైడ్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 

Updated Date - 2020-02-20T06:31:07+05:30 IST