ఆర్టీసీ చార్జీలతో మళ్లీ.. బాదుడే బాదుడు!

ABN , First Publish Date - 2022-07-03T04:44:04+05:30 IST

ఆర్టీసీ చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందంటూ రాజంపేట ఆర్టీసీ బస్టాండు వద్ద శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నిరసన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ చార్జీలతో మళ్లీ.. బాదుడే బాదుడు!
రాజంపేట ఆర్టీసీ డిపో వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు

రాజంపేట, జూలై 2: ఆర్టీసీ చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందంటూ రాజంపేట ఆర్టీసీ బస్టాండు వద్ద శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు  బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నిరసన వ్యక్తం చేశారు.  నిత్యావసరాల ధరలను భారీగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం,  సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా మళ్లీ ఆర్టీసీ చార్జీలుపెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై ముద్రించిన కరపత్రాలను  ప్రయాణికులకు అందజేశారు. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన రీతిలో  బుద్ధి చెప్పాలని కోరారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రమణ్యం నాయుడు, రూరల్‌ అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్యనాయుడు, ఎస్సీ సెల్‌ నాయకులు మందా శ్రీనివాసులు, బీసీ సెల్‌ నాయకులు రామ్‌ నగర్‌ నరసింహ, రాజంపేట పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అబూబకర్‌, మాజీ టీడీపీ పట్టణ అధ్యక్షుడు సంజీవ రావు, ఆచారి తదితరులు పాల్గొన్నారు.

గాలివీడు: అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచడం అమాను షమని మాజీ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం మాజీ సర్పంచ్‌ చిన్నపరెడి ్డ ఆధ్వర్యంలో గరుగుపల్లె కస్పాలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.  మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షు డు లక్ష్మయ్య, మాజీ సర్పంచులు మహమ్మద్‌ రియాజ్‌, భద్రప్ప నాయు డు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, ప్రభాకర్‌నాయుడు, వెంకట్రమణ, రాష్ట్ర ఎస్టీ నాయకులు మిట్టేనాయక్‌, టీడీపీ నాయకులు డాక్టర్‌ రామ చంద్రా రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పుల్లయ్య, కదిరినాయుడు, అనిల్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌ కుమార్‌, రామాజుల్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

లక్కిరెడ్డిపల్లె:  ఆర్టీసీ చార్జీలతో ప్రజలపై భారం మోపిన ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ కాలాడి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌ కేశవయ్య పిలుపునిచ్చారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా శనివారం దప్పేపల్లెలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.  ఎంపీటీసీ సభ్యుడు మూగి శ్రీరాములు, టీడీపీ నాయకులు రవిశంకర్‌రెడ్డి, అజ్మతుల్లా, సుబ్బారెడ్డి, ఆదిరెడ్డి, పక్కీర్‌సాబ్‌, ఉత్తన్న, ఓబులేసు, ఓబులప్ప, భూషణ్‌రెడ్డి, హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నందలూరు:  ఆర్టీసీ చార్జీల పెంపుకు నిరసనగా శనివారం టీడీపీ మండల అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య ఆధ్వర్యంలో కడప-రాజంపేట మార్గంలో వెళుతున్న బస్సులో ఎక్కి ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఆల్విన్‌ కర్మాగారం నుంచి స్థానిక బస్టాండు కూడలి వరకు పాద యాత్ర చేసి బస్టాండు కూడలిలో నిరసన తెలిపారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర టీడీపీ బీసీ సెల్‌ కార్యదర్శి సమ్మెట శివప్రసాద్‌, మండల క్లస్టర్‌ మోడపోతుల రాము, తాటి సుబ్బరాయుడు, నారపుశెట్టి శివ, గుండు సురేష్‌, జ్యోతి శివ, చామం చి పెంచలయ్య, తోట శివశంకర్‌, కానకుర్తి వెంకటయ్య, వేణుగోపాల్‌, గంగనపల్లి శ్రీనివాసులు, ఉప్పుశెట్టి రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఒంటిమిట్ట:  మండల కేంద్రంలోని కడప-చెన్నై రహదారిపై ఆర్టీసీ బస్సులను నిలిపి ఆందోళన చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు పెంచిన చార్జీలపై కరపత్రాలను పంచారు. టీడీపీ నాయకులు రామచంద్ర య్య, బొబ్బిలి రాయుడు, డాక్టర్‌ కృష్ణ, చలపాటి చంద్ర, మోదుగుల హరి, వీరాంజనేయరెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

వీర బల్లి:  రాచపల్లె, పేరయ్యగారిపల్లె హరిజనవాడ, వేల్పుల మిట్ట హరిజనవాడల్లో జిల్లా టీడీపీ నాయకుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ అరాచకాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు.రాజారాజు, సీతారామరాజు, నేతి రమేష్‌, దుర్గం ఆంజనే యులు, ఈశ్వర్‌రెడ్డి, ఆంజనేయులురెడ్డి, నాగసుబ్బమ్మ పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-03T04:44:04+05:30 IST