Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 18:48PM

ఒక్క మోదీ పేరుతో ఎన్నికల్లో గెలవలేం: యడియూరప్ప

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల విషయం పక్కన పెడితే రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనే ఒకే ఒక్క పేరుతో గెలవలేమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవారం అన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత భారతీయ జనతా పార్టీ అధిష్టానంపై సున్నిత విమర్శలు ప్రారంభించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో యడియూరప్ప మాట్లాడుతూ మోదీ ఒక్కరితోనే గెలుస్తామని పార్టీ భావించట్లేదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.


‘‘భ్రమల్లో ఉండొద్దు. నరేంద్రమోదీ పేరు మాత్రమే ఉపయోగించి లోక్‌సభ ఎన్నికల్లో గెలవగలమేమో కానీ, రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో అది సాధ్యం కాదు. కేవలం మోదీ పేరు మాత్రమే ఉపయోగిస్తే ఎన్నికల్లో గెలుస్తామని పార్టీ భావించట్లేదు. మా పనితీరును, మా అభివృద్ధిని ప్రజలకు చూపించాలి. లేదంటే వచ్చే ఎన్నికలు చాలా కష్టంగా ఉంటాయి’’ అని దేవనగరెలో జరిగిన ఓ కార్యక్రమంలో యడియూరప్ప అన్నారు. కాగా, ఇదే దేవనగరెలో రెండు నెలల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై నేతృత్వంలోనే 2023 ఎన్నికలకు వెళ్లనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.


ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అంత సులువుగా తీసుకోవద్దని పార్టీ నేతలకు కార్యకర్తలకు యడియూరప్ప సూచించారు. కాంగ్రెస్‌కు పక్కా వ్యూహాలు, అంచనాలు ఉన్నాయని, వారిని తక్కువగా అంచనా వేస్తే బీజేపీకి ప్రమాదమని అన్నారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సంప్రదించిందని, వచ్చే ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పాటని యడియూరప్ప అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement