సోదరుడికి ప్రేమతో.. రక్షాబంధన్‌

ABN , First Publish Date - 2022-08-13T07:44:35+05:30 IST

నిర్మల్‌లో ఘనంగా రక్షాబంధన్‌ నిర్వహించారు.

సోదరుడికి ప్రేమతో.. రక్షాబంధన్‌
మంత్రికి రాఖీ కడుతున్న మహిళా పోలీసులు

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 12 : నిర్మల్‌లో ఘనంగా రక్షాబంధన్‌ నిర్వహించారు. మంత్రికి ఇంద్రకరణ్‌రెడ్డికి శుక్రవారం మహిళాపోలీస్‌ నిర్మల్‌ డివిజన్‌ అధి కారులు రాఖీ కట్టారు. మహిళా సిబ్బంది పాల్గొన్నారు. 

కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలచారి నివాసంలో రాఖీవేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన సోదరీ పద్మారాణి, కూతురు సింధూరాఖీ కట్టి మిఠా యిలు తినిపించారు. కుటుంబ సభ్యులతో పాటు మహి ళలు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్‌కు రాఖీ పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులు రాఖీ కట్టి వేడుకలు నిర్వహించారు. 

Updated Date - 2022-08-13T07:44:35+05:30 IST