Abn logo
Feb 22 2020 @ 01:48AM

ప్రేమతో... అను!

‘‘హలో! మంచి... చెడు... అనేది జీవితంలో వచ్చే సందర్భాలు, వాటిని మనం చూసే దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. ‘నాకేది మంచిది?’ అని ఈ వేసవిలో మీకు మీరే నిర్ణయించుకోండి! ప్రేమతో... అను’’ అని కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. అను పాత్రలో ఆమె నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రమిది. రుహానీ శర్మ మరో హీరోయిన్‌. జెఫ్రీ గి చిన్‌ దర్శకుడు. విరోనికా మంచు నిర్మాత. హిందీ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుక్రవారం కాజల్‌ అగర్వాల్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మన దేశంలో జరిగిన పెద్ద ఐటి స్కామ్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఇటీవలే లాస్‌ ఏంజిల్స్‌లో కొన్ని సన్నివేశాలు తీశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తున్నాం. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. నవదీప్‌, నవీన్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: షెల్డన్‌ చౌ.

Advertisement
Advertisement
Advertisement