హై టెక్‌ హంగులతో జిల్లా ఆస్పత్రి, వైద్యకళాశాల నిర్మాణం

ABN , First Publish Date - 2022-05-21T04:27:08+05:30 IST

జిల్లా ప్రభుత్వ ఆస్ప త్రిని హైటెక్‌ హంగులతో నిర్మించేందుకు ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి సన్నాహాలు చే స్తున్నారు.

హై టెక్‌ హంగులతో   జిల్లా ఆస్పత్రి, వైద్యకళాశాల నిర్మాణం
స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, అధికారులు (ఫైల్‌)

- అప్పక్‌పల్లి సర్వేనంబర్‌ 209లో 20 ఎకరాల స్థలం గుర్తింపు  

- ఇదీవరకే రూ. 66.48 కోట్లు మంజూరు 

- త్వరలో మంత్రి హరీశ్‌రావు పనులకు శంకుస్థాపన 


నారాయణపేట, మే 20: జిల్లా ప్రభుత్వ ఆస్ప త్రిని హైటెక్‌ హంగులతో నిర్మించేందుకు ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి సన్నాహాలు చే స్తున్నారు. తెలంగాణ ప్ర భుత్వం హెల్త్‌ మెడికల్‌ అండ్‌ ప్యామిలి వెల్ఫేర్‌ డి పార్ట్‌మెంట్‌ జిల్లా ఆస్పత్రి ఎన్‌హెచ్‌ఎం, ఆర్‌ఓపీ ద్వా రా ఏరియా ఆస్పత్రిని జి ల్లా ఆస్పత్రిగా అఫ్‌గ్రేడ్‌ చేస్తూ 3 నవంబర్‌, 2021న జీవో 149 ద్వారా జిల్లా ఆసుపత్రి కోసం 66.48 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్త ర్వులను జారీ చేసింది. ఇందులో 10.48 కోట్లతో ఆధునిక పరికరాలు, రూ. 56 కోట్లతో జిల్లా ఆస్పత్రి భవన నిర్మాణం జరుగనుంది. నారా యణపేట మండలం అప్పక్‌పల్లి గ్రామ ప్రభు త్వ సర్వే నంబర్‌ 209లో 20ఎకరాల విస్తీర్ణంలో రాబోయే ఏడాది ప్రారంభమయ్యే మెడికల్‌ కళా శాలతో పాటు ప్రస్తుతం నిధులు మంజూరైన 350 పడకల జిల్లా ఆసుపత్రిని అన్నీ హంగు లతో ఒకే చోట ఏర్పాటు చేసేందుకు దృష్టిని సా రించారు. త్వరలోనే వైద్య ఆరోగ్యశాఖ మం త్రి హరీశ్‌రావు జిల్లా ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.  అప్ప ట్లో నారాయణపేట శివారులో ప్రభుత్వ 479 సర్వే నంబర్‌లోని 16 ఎకరాల స్థలంలో 350 ప డకలతో  జిల్లా ఆసుపత్రిని నిర్మించాలని అను కున్నా పెరుగుతున్న జనాభా కనుగుణంగా వ చ్చే ఏడాది మెడికల్‌ కళాశాల ప్రారంభమతు న్న దృష్ట్యా అప్పక్‌పల్లి ప్రాంతంలో జిల్లా ఆస్ప త్రితో పాటు మెడికల్‌ కళాశాల రెండు ఒకేచోట నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నారు. కాగా నారాయణపేట ముని సిపాలిటీ పరిధిని పెంచేలా పరిసర గ్రామాలు ఎక్లాస్‌పూర్‌, భైరంకొండ, పేరపళ్ల, శాసన్‌పల్లి, సింగారం, జాజాపూర్‌, అప్పక్‌పల్లి గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి కౌన్సిల్‌లో తీర్మానం కూడా చేశారు. 

Updated Date - 2022-05-21T04:27:08+05:30 IST