మొక్కజొన్న అటుకులతో...

ABN , First Publish Date - 2020-10-03T17:09:29+05:30 IST

మొక్కజొన్న అటుకులు - 100గ్రా, క్యారెట్‌ - రెండు, బీన్స్‌ - నాలుగైదు, క్యాబేజీ - కొద్దిగా, ఆవాలు - పావు టీస్పూన్‌, నూనె సరిపడా, సెనగపప్పు - అర టీస్పూన్‌

మొక్కజొన్న అటుకులతో...

కావలసినవి: మొక్కజొన్న అటుకులు - 100గ్రా, క్యారెట్‌ - రెండు, బీన్స్‌ - నాలుగైదు, క్యాబేజీ - కొద్దిగా, ఆవాలు - పావు టీస్పూన్‌, నూనె సరిపడా, సెనగపప్పు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, మెంతులు - పావు టీ స్పూన్‌, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం: ముందుగా మొక్కజొన్న అటుకలను నానబెట్టి, తరువాత బట్టలో ఆరబెట్టుకోవాలి. తరువాత స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి. సెనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి మరి కాసేపు వేగించాలి. క్యారెట్‌ ముక్కలు, బీన్స్‌, క్యాబేజీ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మొక్కజొన్న అటుకులు వేసి కలియబెట్టుకోవాలి. రెండు నిమిషాలు పాటు మగ్గించి దింపాలి. పిల్లలు సైతం వీటిని ఇష్టంగా తింటారు.

Updated Date - 2020-10-03T17:09:29+05:30 IST