ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం..!

ABN , First Publish Date - 2020-08-10T02:33:57+05:30 IST

ఆస్ట్రేలియాలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా విక్టోరియా రాష్ట్రంలో ఈ మహమ్మారి విజృంభి

ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం..!

సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా విక్టోరియా రాష్ట్రంలో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. కాగా.. గడిచిన 24 గంటల్లో విక్టోరియా రాష్ట్రంలో కొత్తగా 532 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమయంలో దాదాపు 10 మంది మృత్యువాతపడ్డట్లు తెలిపింది. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరింది. ఇందుకోసం నిబంధనలను విధిగా పాటించాలని సూచించింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య 20వేలకు చేరింది. సుమారు 278 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. కరోనా కట్టడికి విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. విక్టోరియా రాష్ట్రంలో విపత్తు స్థితిని ప్రకటించింది. ప్రజలు తమ ఇళ్ల నుంచి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుంది. 


Updated Date - 2020-08-10T02:33:57+05:30 IST