పాకిస్థాన్‌లో ఒకేరోజు 4,439 కేసులు

ABN , First Publish Date - 2020-07-03T04:42:03+05:30 IST

పాకిస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో 4,439 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది.

పాకిస్థాన్‌లో ఒకేరోజు 4,439 కేసులు

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో 4,439 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,17,809కి చేరింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో 78 మంది మరణించినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తంగా 1,04,694 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని.. దీనిబట్టి మొత్తం కేసుల్లో దాదాపు సగం మంది కరోనా నుంచి బయటపడినట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ ఇప్పటివరకు మొత్తం 13,27,638 కరోనా పరీక్షలను నిర్వహించింది. గడిచిన 24 గంట్లోనే 22,128 పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాక వెల్లడించింది. కాగా.. పాకిస్థాన్‌లో అత్యధిక కరోనా కేసులు సింధ్ ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో అక్కడ ఒక్కచోటే దాదాపు 87 వేల కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత పంజాబ్ ప్రావిన్స్‌లో 77,740 కేసులు బయటపడ్డాయి. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతోనే పాకిస్థాన్‌లో కేసులు ఈ రకంగా నమోదవుతున్నాయి. దీంతో కరోనా హాట్‌స్పాట్‌లలో స్మార్ట్ లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. స్మార్ట్‌ లాక్‌డౌన్‌లో భాగంగా వ్యాపారాలు వారంలో ఐదు రోజులు మాత్రమే కార్యకలాపాలు సాగిస్తాయి. ఇదే సమయంలో విద్యాసంస్థలు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, మత సమావేశాలు, సామాజిక సమావేశాలపై పూర్తి నిషేధం ఉంటుంది. 

Updated Date - 2020-07-03T04:42:03+05:30 IST