తెలంగాణావాసులందరికీ బోనాల శుభాకాంక్షలు: పవన్‌

ABN , First Publish Date - 2021-07-25T20:41:30+05:30 IST

తెలంగాణావాసులందరికీ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింప

తెలంగాణావాసులందరికీ బోనాల శుభాకాంక్షలు: పవన్‌

హైదరాబాద్: తెలంగాణావాసులందరికీ జనసేన అధినేత పవన్‌కల్యాణ్  బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింప చేసే మహత్తర వేడుక. బోనమెత్తే ప్రతీ ఆడపడుచును ఆ పరమేశ్వరి ఆశీర్వదించాలి. ప్రకృతి విపత్తులు, రోగబాధలు లేని జీవితాన్ని ప్రజలకు అమ్మవారు ప్రసాదించాలి’’ అని పవన్‌కల్యాణ్‌ ఆకాంక్షించారు. బోనాల జాతర లష్కర్‌‌ సిద్ధమైంది. ఈ నెల 25 (ఆదివారం)న బోనాలు, 26(సోమవారం)న రంగం (భవిష్యవాణి) జరగనున్నాయి. కొవిడ్‌ కారణంగా గతేడాది సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి బోనాలు సమర్పించలేదని నిరాశ చెందిన భక్తులకు ఈ ఏడాది ఆ అవకాశం లభించనుంది. బోనాలకు అశేష సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.

Updated Date - 2021-07-25T20:41:30+05:30 IST