Maharashtra CM గా బ్రాహ్మణుడిని చూడాలి: Union minister

ABN , First Publish Date - 2022-05-05T22:29:16+05:30 IST

ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాట్లాడుతూ స్థానిక పాలక సంస్థల్లో బ్రాహ్మణులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. అనంతరం దాన్వే స్పందిస్తూ ‘‘స్థానిక సంస్థల్లో ఎక్కువ మంది బ్రాహ్మణులనో, స్థానిక సంస్థల అధినేతలుగానో బ్రాహ్మణులను చూడాలని..

Maharashtra CM గా బ్రాహ్మణుడిని చూడాలి: Union minister

ముంబై: Maharashtra ముఖ్యమంత్రిగా బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తిని చూడాలని అనుకుంటున్నట్లు Union minister Raosaheb Danve అన్నారు. పరుశురామ జయంతిని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్రంలోని Jalna లో బ్రాహ్మణ వర్గాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి దాన్వే హాజరయ్యారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల్లో ముందున్న బ్రాహ్మణులు రాజకీయాల్లో ముందుండాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాట్లాడుతూ స్థానిక పాలక సంస్థల్లో బ్రాహ్మణులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. అనంతరం దాన్వే స్పందిస్తూ ‘‘స్థానిక సంస్థల్లో ఎక్కువ మంది బ్రాహ్మణులనో, స్థానిక సంస్థల అధినేతలుగానో బ్రాహ్మణులను చూడాలని నేను అనుకోవడం లేదు. నేను ఈ రాష్ట్రానికి (మహారాష్ట్ర) ముఖ్యమంత్రిగా ఒక బ్రాహ్మణుడిని చూడాలని అనుకుంటున్నాను’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో కులతత్వం వచ్చిందని దాన్ని తక్కువ అంచనా వేయలేమని అన్నారు. ఆయా కులాల్ని పట్టుకున్న వ్యక్తులు నాయకులు అవుతున్నారని దాన్వే అన్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం జరిగిన Uttarakhand, Uttar Pradesh రాష్ట్రాల Assembly elections లో ప్రచారం చేశారు.


కాగా, దాన్వే వ్యాఖ్యలపై Maharashtra డిప్యూటీ సీఎం Ajit Pawar స్పందిస్తూ 145 మంది MLA లు ఉంటే transgender అయినా, ఏ కులానికి, ఏ మతానికి చెందిన వ్యక్తైనా ముఖ్యమంత్రి అవ్వొచ్చని అన్నారు. దాన్వే వ్యాఖ్యలపై అజిత్ పవార్‌ను గురువారం మీడియా ప్రశ్నించగా.. ‘‘ముఖ్యమంత్రి ఎవరైనా అవ్వొచ్చు. ముఖ్యమంత్రి కావడానికి తగినంత ఎమ్మెల్యేల బలం కావాలి. 145 మంది ఎమ్మెల్యేలు ఉంటే ట్రాన్స్‌జెండర్ అయినా మరే ఇతర వ్యక్తి అయినా, వాళ్లు ఏ కులం, మతం వారు అయినా ముఖ్యమంత్రి అవ్వొచ్చు’’ అని అన్నారు.

Read more