Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందరికీ విజయాలు చేకూరాలి

 జిల్లా ప్రజలకు మంత్రి జగదీష్‌రెడ్డి  దసరా పండుగ శుభాకాంక్షలు

 సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష

నల్లగొండ రూరల్‌, అక్టోబరు 14: అందరికీ విజయాలు చేకూరాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి అంటేనే చెడుపై మంచి గెలిచిన రోజు అని, అటువంటి రోజు ప్రజలకు స్ఫూర్తి కావాలని ఆయన అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలన్నారు. అందివచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరంతరం ఉచిత విద్యుత్‌, సమృద్ధిగా నీటితో పచ్చని మాగాణంతో ధాన్యపు సిరులు పండాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. 

Advertisement
Advertisement