ఈ 6తో హుషారు...

ABN , First Publish Date - 2020-09-07T06:09:24+05:30 IST

రోజూ పది నిమిషాలు యోగా చేస్తే శరీరానికి ఎంతో మంచిది. ఎంతో ఉత్సాహంగా ఉంటాం. ఇలా యోగా చేయడం వల్ల మెదడు, శరీరం రెండూ సమతుల్యత సాధిస్తాయి...

ఈ 6తో హుషారు...

రోజూ పది నిమిషాలు యోగా చేస్తే శరీరానికి ఎంతో మంచిది. ఎంతో ఉత్సాహంగా ఉంటాం. ఇలా యోగా చేయడం వల్ల మెదడు, శరీరం రెండూ సమతుల్యత సాధిస్తాయి. కింద పేర్కొన్న యోగాసనాలను మనం ఉన్న చోటే సులువుగా చేయొచ్చు. ఈ యోగాసనాలు శరీరాకారాన్ని ఫ్లెక్సిబిలిటీగా తయారుచేస్తాయి. దృఢత్వాన్ని వృద్ధిచేస్తాయి. అంతేకాదు శారీరక సమతుల్యతను సాధిస్తాం కూడా. వాటిల్లో కొన్ని...


  • ఛైల్డ్‌ పోజ్‌: మోకాళ్లు మడవాలి. రెండు కాళ్ల బొటనవేళ్లు ఒకదానితో ఒకటి తగలాలి. నేలకు నుదురు తాకేలా తల వాల్చి చేతులను ముందుకు చాచాలి. ఏకాగ్రతతో శ్వాసను మూడు లేదా ఐదు సార్లు లోపలికి, బయటకు పీల్చి వదలాలి. 

  • టేబుల్‌ టాప్‌: ఫొటోలో చూపించినట్టుగా టేబుల్‌టాప్‌ భంగిమ పెట్టాలి.  భుజాల బరువును చేతుల మీద ఒత్తిపెట్టి నడుం, పిరుదులు పైకి లేపి టేబుల్‌ భంగిమలో కాళ్లు వంచాలి. చేతులు, మోకాళ్లు బరువును సమానంగా బ్యాలెన్స్‌ చేసుకోవాలి. పాదాలను తేలిగ్గా ఉంచాలి.  కిందకు వంగినపుడు వెన్నెముకకు పొట్టలోని కండరాలు తాకేలా ఉంచాలి. చూపు నేలపై ఉండాలి.

  • క్యాట్‌ పోజ్‌: చేతులను నేలపై గట్టిగా ఆనించి వీపు పైభాగాన్ని వంచాలి. తలను నేల వేపు వాల్చాలి. ఛాతీకి మీ చిన్‌ (గెడ్డం) తగిలేలా పెట్టాలి. వెన్నముకకు తగిలేలా పొట్ట పొజిషన్‌ ఉండాలి. 

  • కౌవ్‌ పోజ్‌: మీ చేతులను నేలకు వత్తిపెట్టాలి. ఆవు ముందుకు చూస్తున్న భంగిమలో తలను పెట్టాలి. వెన్నెముక కింది భాగాన్ని కాస్త కిందకు వంచాలి. చెవులకు దగ్గరగా భుజాలు ఉండకుండా కాస్త కిందకు జార్చాలి. 

  • డౌన్‌వర్డ్‌ ఫేసింగ్‌ డాగ్‌ పోజ్‌: కిందకు వంగాలి. చేతులను ఒకటి రెండు అంగుళాల ముందు ఉండేట్టు పెట్టాలి. పాదాల వేళ్లను కొద్దిగా మడిచి  పిరుదులను పైకి లేపాలి. ఇలా శరీరాన్ని వంచేటప్పుడు కాళ్లను కొద్దిగా ముందుకు వంచాలి. కాళ్ల మడవలు   నేలకు ఆనించి ఉంచాలి. చేతివేళ్లు కిందికి ఆనేలా వంగాలి. పిరుదులను అప్‌ అండ్‌ బ్యాక్‌ చేసేటప్పుడు వేళ్లను  నేలకు వత్తిపెట్టాలి.  అలా చేసి మూడు లేదా ఐదు సార్లు శ్వాస లోపలికి, బయటకు గట్టిగా పీల్చి వదలాలి.

Updated Date - 2020-09-07T06:09:24+05:30 IST