జ్ఞాన దంతాలు ఉంటే జ్ఞానం పెరుగుతుందా? దీనిలో నిజానిజాలేమిటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-02-08T14:37:37+05:30 IST

జ్ఞాన దంతాలు వచ్చినప్పుడు మనిషికి మేధస్సు..

జ్ఞాన దంతాలు ఉంటే జ్ఞానం పెరుగుతుందా? దీనిలో నిజానిజాలేమిటో తెలిస్తే..

జ్ఞాన దంతాలు వచ్చినప్పుడు మనిషికి మేధస్సు, ఆలోచనా సామర్థ్యం (IQ) పెరుగుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. జ్ఞాన దంతాలు కలిగినవారు మరింత తెలివైన వారవుతారని నమ్ముతారు. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. జ్ఞాన దంతాలు ఉన్నంత మాత్రాలన మనిషి మేధావి కాలేడని పరిశోధనలో తేలింది. ఇదే విధంగా ఈ పరిశోధనలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయిలే జ్ఞాన దంతాల విషయంలో ఈ నమ్మకం ఎలా ఏర్పడిందో.. దానికి కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  వెబ్ ఎండీ తెలిపిన వివరాల ప్రకారం ఒక వయోజనునికి మొత్తం 32 దంతాలు ఉంటాయి. వీటిలో 4 (పైన రెండు, కింద రెండు) జ్ఞాన దంతాలు ఉంటాయి. ఈ జ్ఞాన దంతాలు నాలుగు మూలల్లో ఉంటాయి. అయితే వీటికి.. మేధస్సు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని పరిశోధనలు నిరూపించాయి. అయితే జ్ఞాన దంతాలు కొన్ని సమస్యలను తెచ్చిపెడతాయని వెబ్‌ఎమ్‌డి రిపోర్టు చెబుతోంది. 


ఈ నేపధ్యంలో యుఎస్‌‌లో జ్ఞాన దంతాలను తొలగించడానికి ప్రతి సంవత్సరం 10 మిలియన్ల శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. జ్ఞాన దంతాల వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటిలో గొంతు సమస్యలు, ఇన్ఫెక్షన్, దంతాల చుట్టూ దెబ్బతినడం, ఎముకల వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు నష్టం మొదలైనవి ఉన్నాయి. జ్ఞాన దంతాలు తొలగించిన తర్వాత మొదటి రోజు రక్తస్రావం జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొంత సమయం పాటు వాపు కూడా ఉండవచ్చు.అటువంటి సందర్భంలో కొంత సమయం వరకు బ్రష్‌ను ఉపయోగించకూడదని వైద్యులు సలహా ఇస్తుంటారు. దాదాపు 24 గంటల పాటు ఇలా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. మొత్తంగా చూస్తే జ్ఞాన దంతాలు కలిగి ఉంటే.. తెలివితేటలు పెరుగుతాయనడం అనేది అస్సలు కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది. 



Updated Date - 2022-02-08T14:37:37+05:30 IST