Abn logo
Feb 22 2020 @ 01:37AM

విప్రో చేతికి అమెరికా కంపెనీ

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన డిజిటల్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కంపెనీ ‘రేషనల్‌ ఇంటరాక్షన్‌’ను కొనుగోలు చేసినట్లు దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ప్రకటించింది. తన డిజిటల్‌ వ్యాపార విభాగమైన విప్రో డిజిటల్‌ ద్వారా ఈ కొనుగోలు జరిపింది. ఒప్పందం విలువను మాత్రం వెల్లడించలేదు. వాషింగ్టన్‌ ప్రధాన కేంద్రంగా 2009లో ప్రారంభమైన రేషనల్‌ ఇంటరాక్షన్‌లో ప్రస్తుతం 300కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సియాటిల్‌, బెలెవ్యూ, డబ్లిన్‌, సిడ్నీలోనూ శాఖలను ఏర్పాటు చేసింది. డిజిటల్‌ సేవలు మరింత వ్యాప్తి చెందడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో సేవల సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు రేషనల్‌ ఇంటరాక్షన్‌ కొనుగోలు దోహదపడనుందని విప్రో డిజిటల్‌ పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement