Wipro: విప్రోలో ఉద్యోగం చేస్తున్నారా.. దసరా పండుగకు ముందే మీకు పండగొచ్చేసిందిగా..!

ABN , First Publish Date - 2022-09-26T21:41:33+05:30 IST

దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటైన విప్రో (Wipro) ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. మూన్‌లైటింగ్ (Moon Lighting) విధానాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించిన..

Wipro: విప్రోలో ఉద్యోగం చేస్తున్నారా.. దసరా పండుగకు ముందే మీకు పండగొచ్చేసిందిగా..!

దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటైన విప్రో (Wipro) ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. మూన్‌లైటింగ్ (Moon Lighting) విధానాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించిన విప్రో ఇటీవల 300 మంది ఉద్యోగులు Moon Lighting విధానంలో పనిచేస్తున్నారని గుర్తించి వారిని కొలువుల్లో నుంచి పీకేసింది. విప్రో తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. 300 మంది ఉద్యోగులను ఉద్యోగాల్లో నుంచి తప్పించేసిన విప్రో ప్రస్తుతం తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం శుభవార్త చెప్పింది. బెంగళూరుకు చెందిన ఈ ప్రముఖ ఐటీ సంస్థ (Wipro IT Company) ఉద్యోగులకు వేతనాలను పెంచుతున్నట్లు (Wipro Salary Hike) తాజాగా ప్రకటించింది. తమ సంస్థలో ఉద్యోగం చేస్తున్న 96 శాతం మందికి పైగా ఉద్యోగులకు ఈ వేతన పెంపు వర్తిస్తుందని విప్రో తెలిపింది. ఈ మేరకు Salary Increase Letter చాలామంది ఉద్యోగులకు మెయిల్ చేసినట్లు వెల్లడించింది. మెయిల్ అందని వారు ఈ నెలాఖరు లోపు వేతనాల పెంపుకు సంబంధించిన మెయిల్ పొందుతారని విప్రో హెచ్‌ఆర్ (Wipro HR) చీఫ్ ఆఫీసర్ సౌరబ్ గోవిల్ (Suarab Govil) స్వయంగా వెల్లడించారు.



గోవిల్ విప్రో ఉద్యోగులకు పంపిన ఆ మెయిల్‌లో ఏముందంటే.. ‘‘గత త్రైమాసికంలో ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పటికీ.. శాలరీలను పెంచుతున్నాం. ఈ వేతనాల పెంపు మీ అంకిత భావం, ఉద్యోగ సామర్థ్యానికి నిదర్శనంగా భావించగలరు. కష్టపడి పనిచేస్తే ప్రతిఫలం దక్కుతుందనడానికి ఇదే సంకేతం’’ అని ఆ మెయిల్‌లో గోవిల్ విప్రో ఉద్యోగులకు చెప్పారు. విప్రో వేతనాల పెంపులో భాగంగా పెంచిన మొత్తాన్ని సెప్టెంబర్ వేతనంతో పాటే విప్రో ఉద్యోగులు పొందనున్నారు. ఇదిలా ఉండగా.. విప్రోలో C1 Band స్థాయిలో ఉద్యోగం చేస్తున్న మేనేజర్లు, ఆ పై స్థాయి ఉద్యోగులు ఇప్పటికే గతేడాది జూన్‌లో ఇంక్రిమెంట్ పొందారు. ఈ సంవత్సరం ఉద్యోగులు పెంచిన వేతనాలను అందుకోబోతున్నారు.



సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగులు పొందనున్న ఇంక్రిమెంట్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని విప్రో స్పష్టం చేసింది. మొత్తంగా చూసుకుంటే.. విప్రో ఉద్యోగులు వేతనాల పెంపు కారణంగా ఈ దసరా పండుగకు (Dasara Festival) నిజంగానే పండగ చేసుకోబోతున్నారనమాట. విప్రో ఉద్యోగులు వేతనాల పెంపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. వేతనాల పెంపును ప్రకటించిన విప్రో ఎవరికి ఎంత పెంచనున్నారో, ఎంత శాతం ఇంక్రిమెంట్లు అందనున్నాయనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయం ఉద్యోగులు అందుకునే పే స్లిప్స్‌తో తెలియనుంది.

Updated Date - 2022-09-26T21:41:33+05:30 IST