Parliamentలో తొలిరోజే సాగు చట్టాలను రద్దుచేయాలి

ABN , First Publish Date - 2021-11-22T17:47:21+05:30 IST

పార్లమెంట్‌ శీతాకాలపు సమావేశాల ప్రారంభమయ్యే తొలి రోజునే వివాదాస్పదమైన మూడు సాగుచట్టాలను ఉపసంహరిం చుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డీఎంకే ఎంపీల సమావేశం తీర్మానం చేసింది. స్థానిక తేనాంపేటలోని

Parliamentలో తొలిరోజే సాగు చట్టాలను రద్దుచేయాలి

డీఎంకే ఎంపీల సమావేశం తీర్మానం

చెన్నై: పార్లమెంట్‌ శీతాకాలపు సమావేశాల ప్రారంభమయ్యే తొలి రోజునే వివాదాస్పదమైన మూడు సాగుచట్టాలను ఉపసంహరిం చుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డీఎంకే ఎంపీల సమావేశం తీర్మానం చేసింది. స్థానిక తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆ పార్టీ పార్లమెంట్‌ సభ్యుల సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. ఈ సమావేశా నికి డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధ్యక్షత వహించారు. డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీని యర్‌ మంత్రి దురైమురుగన్‌, కోశాధికారి, ఎంపీ టీఆర్‌ బాలు, వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి, కార్యదర్శి కేఎన్‌ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29న ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాలపు సమావేశాల్లో ఉభయ సభలలో డీఎంకే ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలను గురించి చర్చించే నిమిత్తం ఈ సమావేశం ఏర్పాటైంది.


ఈ సమావేశం ప్రారంభమైన వెంటనే సాగు చట్టాల రద్దు కోసం దేశరాజధాని ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసిన 700ల మందికి పైగా రైతుల మృతికి సంతాపం ప్రకటిస్తూ తొలి తీర్మానం చేశారు. సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకులు, ఎంపీ లు లేచి నిలిచి రెండు నిమిషాలపాటు మౌనం పాటించా రు. సాగుచట్టాల రద్దు కోసం అన్నదాతలకు అండగా నిలిచిన డీఎంకే ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి ఆమో దించటం పట్ల ఎంపీలు హర్షం ప్రకటించారు. సాగుచట్టా లకు వ్యతిరేకంగా మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రంలో ఆందో ళనలు జరిపిన పార్టీ నాయకులను అభినందించారు. అన్నదాతల ఆందోళనకు తలొగ్గి ప్రధాని నరేంద్ర మోదీ ఆ మూడు సాగుచట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రకటిం చారు. పార్లమెంట్‌లో ఆ చట్టాలను రద్దు చేసేంతవరకూ అన్నదాతలు ఢిల్లీలో ఆందోళనను కొనసాగించనున్నారని ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పార్లమెంట్‌ శీతాకాలపు సమావేశాలు ప్రారంభమయ్యే ఈ నెల 29నే ఉభయ సభలలోనూ ఆ మూడు చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఎంపీల సమావేశంలో మరో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో కనిమొళి, తమిళచ్చి తంగపాండ్యన్‌, ఏ రాజా, దయానిధి మారన్‌, జగద్రక్షగన్‌, టీకేఎస్‌ ఇలంగోవన్‌, ఎన్‌ఆర్‌ ఇలంగో, విల్సన్‌, కళానిధి వీరాసామి, కదిర్‌ ఆనంద్‌, గౌతమ్‌ శిఖామణి, జ్ఞానద్రవియం, కనిమొళి సోము, ఎఎం అబ్దుల్లా, రాజేశ్‌కుమార్‌, ఎన్‌ఆర్‌ పార్తీబన్‌ తదితర డీఎంకే ఎంపీలందరూ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-22T17:47:21+05:30 IST