క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

ABN , First Publish Date - 2022-08-20T05:39:19+05:30 IST

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం
కడ్తాల్‌: క్రీడాదుస్తులు పంపిణీ చేస్తున్న నరేశ్‌నాయక్‌

మొయినాబాద్‌ రూరల్‌/ఆమనగల్లు/కడ్తాల్‌, ఆగస్టు 19: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివా్‌సగుప్త తెలిపారు. మండలంలోని హిమయత్‌ నగర్‌ రెవెన్యూలోని ఓక్రీడామైదానంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ అధ్వర్యంలో కబడ్డీ, క్రికెట్‌, రింగ్‌ తదితర ఆటలపోటీలు రెండు రోజులుగా జరగగా శుక్రవారం ముగిశాయి.  కార్యక్రమంలో తెలంగాణ హరిత హోటల్‌ ఎండీ కే.నాథన్‌, శాంతి, నర్సింహారావు, రవీందర్‌ నాయక్‌, అంజిరెడ్డి, ఇబ్రహీం, లక్ష్యరావు, ఓంప్రకాష్‌, రాజేశ్వర్‌, మహేష్‌ సిబ్బంది పాల్గొన్నారు.  ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి, మాడ్గుల మండలాల నుంచి జిల్లా స్థాయి ఫ్రీడంకప్‌ పోటీలకు ఎంపికైన విద్యార్థులను సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ కలిసి అభినందించారు.  రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, వీరయ్య, నారాయణ ఉన్నారు.  ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి, మాడ్గుల మండలాల నుంచి జిల్లా స్థాయి ఫ్రీడంకప్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు కేఎన్‌ఆర్‌ యువసేన ఆధ్వర్యంలో శుక్రవారం కడ్తాల జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడాదుస్తుల పంపిణీ చేశారు. ఆయా మండలాలకు చెందిన 120 మంది విద్యార్థులకు కేఎన్‌ఆర్‌ యువసేన జిల్లా అధ్యక్షుడు నరేశ్‌ నాయక్‌ క్రీడా దుస్తులను సమకూర్చారు. గిరిజన సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మనాయక్‌, పాఠశాల హెచ్‌ఎం జంగయ్యలతో కలిసి నరేశ్‌నాయక్‌ పంపిణీ చేశారు. నాయకులు యాదగిరిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, జహంగీర్‌అలీ, శ్రీను, యాదయ్య, మహేందర్‌, అంజిరెడ్డి, పీడీ చంద్రమోహన్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-20T05:39:19+05:30 IST