Mega Millions jackpot: 2 డాలర్లు పెట్టి లాటరీ టికెట్‌‌ కొనుగోలు చేస్తే.. రూ.10వేల కోట్లు వచ్చిపడ్డాయ్!

ABN , First Publish Date - 2022-07-31T13:22:53+05:30 IST

అమెరికాలో ఓ వ్యక్తికి అదృష్టం ఊహకందని రేంజ్‌లో వరించింది. రెండు డాలర్లు పెట్టి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ ఏకంగా రూ.10,136 కోట్లు(1.28 బిలియన్‌ డాలర్లు) తెచ్చిపెట్టింది.

Mega Millions jackpot: 2 డాలర్లు పెట్టి లాటరీ టికెట్‌‌ కొనుగోలు చేస్తే.. రూ.10వేల కోట్లు వచ్చిపడ్డాయ్!

అమెరికాలో రూ.10 వేల కోట్ల లాటరీ

వాషింగ్టన్‌, జూలై 30 : అమెరికాలో ఓ వ్యక్తికి అదృష్టం ఊహకందని రేంజ్‌లో వరించింది. రెండు డాలర్లు పెట్టి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ ఏకంగా రూ.10,136 కోట్లు(1.28 బిలియన్‌ డాలర్లు) తెచ్చిపెట్టింది. మెగా మిలియన్స్‌ అనే సంస్థ ఈ లాటరీ నిర్వహించింది. జాక్‌పాట్‌ బహుమతి పొందిన టికెట్‌ వివరాలను ఆ సంస్థ శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో ఈ టికెట్‌ అమ్ముడైందని తెలిపింది. అయితే, ఈ బంపర్‌ బహుమతి పొందిన అదృష్టవంతుని వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. అయితే, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ లాటరీలో 2015 నుంచి జరిగిన 29 డ్రాల్లో ఒక్కరు కూడా జాక్‌పాట్‌ బహుమతి గెలవలేదు.

Updated Date - 2022-07-31T13:22:53+05:30 IST