చెడుగుడు పోటీల్లో విజేత ‘పశ్చిమ’

ABN , First Publish Date - 2022-01-18T06:18:09+05:30 IST

క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకొని సమాజాభివృద్ధికి పాటుపడాలని నరసాపురం సబ్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ అన్నారు.

చెడుగుడు పోటీల్లో విజేత ‘పశ్చిమ’
పశ్చిమ జట్టుకు బహుమతిని అందజేస్తున్న ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ

ముగిసిన డీవైఎఫ్‌ఐ యువజనోత్సవాలు

ఆకివీడు, జనవరి 17: క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకొని సమాజాభివృద్ధికి పాటుపడాలని నరసాపురం సబ్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ అన్నారు. డీవైఎఫ్‌ఐ 39వ సంక్రాంతి యువజనోత్సవాల్లో భాగంగా ఆకివీడులో రాష్ట్రస్థాయి మహిళల వాలీబాల్‌, పురుషుల చెడుగుడు పోటీలు జరిగాయి. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ ప్రభుత్వం విష క్రీడలు ప్రోత్సహి ంచడం దుర్మార్గమన్నారు. 

విజేతలు: మహిళల వాలీబాల్‌ ఫైనల్స్‌లో కృష్ణా, గుంటూరు జట్లు తలపడగా కృష్ణాజిల్లా జట్టు విజేతగా నిలిచింది. పురుషుల చెడుగుడు పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుపాడు జట్టు, కృష్ణాజిల్లా కాళ్లపాలెం జట్టు తలపడగా పశ్చిమ జట్టు విజేతగా నిలిచింది.  ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, తహసీల్దార్‌ ఎన్‌.గురుమూర్తిరెడ్డి, ఎంపీపీ కఠారి జయలక్ష్మి, డీవైఎఫ్‌ఐ ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎండీ మదనీ, జిల్లా కార్యదర్శి బి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-18T06:18:09+05:30 IST