నిత్యావసరాల ధరలకు రెక్కలు

ABN , First Publish Date - 2021-04-17T05:45:40+05:30 IST

నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడంతో సామాన్య జనం అల్లాడుతున్నారు. ఆదాయం మూరెడైతే.. ఖర్చు బారెడవుతుండటంతో బతుకు ఎలా సాగించాలన్న సందిగ్ధంలో ప్రజలు తల్లడిల్లుతున్నారు.

నిత్యావసరాల ధరలకు రెక్కలు

కణేకల్లు, ఏప్రిల్‌ 16: నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడంతో  సామాన్య జనం అల్లాడుతున్నారు. ఆదాయం మూరెడైతే.. ఖర్చు బారెడవుతుండటంతో బతుకు ఎలా సాగించాలన్న సందిగ్ధంలో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ప్రతిరోజూ ధరలు పెరుగుతుండటంతో సామాన్యుల పరిస్థితి అగ మ్యగోచరంగా తయారైంది. 


ఏడాదిలోనే అమాంతం పెరిగిన ధరలు

2020 మార్చి నుంచి మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారి గా అమాంతం పెరిగాయి. యేడాది క్రితం కిలో రూ.80 నుంచి 90 మధ్య ఉన్న మంచినూనె ఒక్కసారిగా రూ.125- రూ.150 కు చేరింది. కంది బ్యాళ్లు కిలో రూ.80 నుంచి రూ.110లకు చేరగా, బెల్లం రూ.35 నుంచి రూ.43కు కొ బ్బరి రూ.110 నుంచి రూ.180లకు వేరుశనగ విత్తనాలు రూ.60 నుంచి రూ. వందకు ఎగబాకాయి. ఇవన్నీ ప్రజలు ప్రతినిత్యం వంటలకు వాడాల్సిన స రుకులు కాగా ఇవి ఒక్కసారిగా రెండింతలు పెరగడంతో సామాన్యులకు పెనుభారంగా తయారయ్యాయి. 


చుక్కలు చూపుతున్న గ్యాస్‌ ధర 

గ్యాస్‌ సిలెండరు ధర రూ.630 నుంచి ఉన్నఫలంగా రూ.910లకు చేరడం తో మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇక పెట్రోల్‌ ధర రూ. 75 నుంచి రూ.97కు, డీజిల్‌ ధర రూ.76 నుంచి రూ.92కు చేరడంతో దిగువ, మధ్య తరగతి ప్రజలు తీవ్ర వేదనకు గురవుతున్నారు. వీటితో పాటు సి మెంటు రూ.300 నుంచి రూ.420కు, స్టీల్‌ కిలో రూ.40 నుంచి రూ.58కు, ఇ సుక ట్రాక్టర్‌ ధర రూ.800 నుంచి రూ.2500లకు పెరగడంతో విలవిలలాడు తున్నారు. ప్రతిరోజూ పనులకు వెళ్లి రూ.400 నుంచి రూ.500 వరకు ఆదా యం సమకూర్చుకుంటేనే బతుకుబండి ముందుకు సాగుతుంది. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా నిత్యావసర సరుకుల ధరలను సామాన్యులకు అందుబాటులో లేకుండా పెంచడంతో అనేక కుటుంబాలు కుదేలవుతున్నా యి. ఇప్పటికైనా పెంచిన ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. 


సంపాదన అంతా ఇంటి ఖర్చులకే..:

పోతులింగ, హమాలీ, కణేకల్లు  

ప్రతిరోజూ హమాలీ పనులు చేసి రూ.300 నుంచి రూ.400 వరకు సంపాదిస్తున్నా. కుటుంబంలో ఆరుగు రు సభ్యులు వున్నాం. వచ్చిన ఆదాయం మొత్తం ఖర్చులకే సరిపోతుంది. పొదుపు మాట దేవుడెరుగు. పిల్లల ఆరోగ్యాలు, చదువులకోసం ఇఅప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు తమలాంటి పేద కుటుంబాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిత్యావస రాల ధరలను పెంచడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.


ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు:

మోహిద్దీన పీరా, రైతు, కణేకల్లు

వ్యవసాయం ద్వారా యేడాదంతా కష్టపడితే  ఏ మా త్రం మిగలని పరిస్థితి. ఇలాంటి తరుణంలో  అప్పులు తెచ్చుకుంటున్నాం. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ సిలెండర్‌ ధరలను పెంచి తమలాంటి సాధారణ కుటుంబాల నడ్డి విరుస్తున్నాయి. ఇలాగైతే తాము ఎలా బతకాలో తెలియని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వాలు ధరలను  వెంటనే  తగ్గించి ప్రజలను ఆదుకోవాలి.

Updated Date - 2021-04-17T05:45:40+05:30 IST