వైరల్ వీడియో.. అక్కడ శునకమే డెలివరీ బాయ్!

ABN , First Publish Date - 2020-04-10T07:02:11+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కొవిడ్ -19 పంజా విసరడంతో.. ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ అయ్యాయి. మహమ్మారిని అరికట్టేందుకు నడుంబిగించా

వైరల్ వీడియో.. అక్కడ శునకమే డెలివరీ బాయ్!

వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కొవిడ్ -19 పంజా విసరడంతో.. ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ అయ్యాయి. మహమ్మారిని అరికట్టేందుకు నడుంబిగించాయి. ఇందులో భాగంగా ప్రభుత్వాలు.. ప్రజల మధ్య సామాజిక దూరాన్ని తప్పనిసరి చేశాయి. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని ప్రజలకు సూచించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓ శునకం వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ శునకం వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఎందుకయ్యిందంటే.. కస్టమర్లకు మద్యం అందిస్తోంది కనుక. వివరాల్లోకి వెళితే..


అమెరికాలోని మేరీలాండ్‌కు చెందిన వ్యక్తి ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. దాని పేరు సోడా. ఆయనకు ఓ వైన్‌షాప్ కూడా ఉంది. కరోనా ప్రభావం వల్ల ప్రజలు సామాజిక దూరం పాటించాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఆ వైన్‌షాప్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. ప్రభుత్వం సూచించిన సామాజిక దూరం నిబంధనను ప్రజలు పాటించేలా చేస్తూనే.. తాను పెంచుకుంటున్న శునకం ద్వారా కస్టమర్లకు మద్యం అందే ఏర్పట్లు చేశాడు. ఆర్డర్ చేసిన మద్యాన్ని పార్కింగ్ ప్రదేశంలో ఉన్న కస్టమర్లకు ఇచ్చేలా సోడాకు ట్రైనింగ్ ఇచ్చాడు. దీంతో ఆ శునకం.. కస్టమర్లకు మద్యం సరఫరా చేస్తూ యజమానికి సహాయపడుతోంది. సోడా మద్యం సరఫరా చేస్తున్న దృశ్యాలను కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2020-04-10T07:02:11+05:30 IST